హైదరాబాద్: నాలుగున్నరేళ్లలో తెలంగాణకు కేసీఆర్ చేసిన అభివృద్ధి ఏమీ లేదని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ ఆరోపించారు. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న జీవీఎల్ ముందస్తు ఎన్నికలపై కేసీఆర్ ఇప్పటికీ స్పష్టత ఇవ్వడం లేదని విమర్శించారు. 

తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాలు వస్తాయి, మన బతుకులు బాగుంటాయి అని తెలంగాణ విద్యార్థులు ఆశతో ఎదురుచూశారని కానీ వారి ఆశలను ఆడియాశలు చేశారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబానికి తప్ప ఏ ఒక్కరికి ఉద్యోగాలు రాలేదన్నారు. 

కేంద్రం నిధులు ఇచ్చినా కేసీఆర్ పాలన చెయ్యలేకపోయారని జీవీఎల్ ఆరోపించారు. కేంద్రం ఇచ్చిన నిధులను దారి మళ్లించారన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అడ్డగోలుగా అధికారాన్ని ఉపయోగించి భూకబ్జాలు చేశారని మండిప్డడారు. 

కాంగ్రెస్ కాంటాక్ట్ రూపంలో టీడీపీతో జతకట్టిందని ఎద్దేవా చేశారు. కేసీఆర్ ను కానీ ప్రజాకూటమిని కానీ తెలంగాణ ప్రజలు నమ్మడం లేదని జీవీఎల్ ధ్వజమెత్తారు.