Asianet News TeluguAsianet News Telugu

కేసీఆర్ నా గురువు.. సీఎంను ప్రజలకు చూపించాలి, కేటీఆర్‌పైనే అనుమానం : బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్యంపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ నేత, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్. కేసీఆర్ ఆరోగ్యం ఎలా వుందో వివరాలు బయటపెట్టాలని.. సీఎంను ప్రజలకు చూపించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.

bjp mp bandi sanjay sensational comments on telangana cm kcr health condition ksp
Author
First Published Oct 10, 2023, 4:56 PM IST | Last Updated Oct 10, 2023, 4:56 PM IST

తెలంగాణ సీఎం కేసీఆర్ గత కొద్దిరోజులుగా ఇంటికే పరిమితమవుతూ వుండటం, మీడియాలోనూ కనిపించకపోవడంతో ఆయన ఆరోగ్యంపై వదంతులు వస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై ఇప్పటికే ఆయన కుమారుడు, మంత్రి కేటీఆర్ స్పందించారు. కేసీఆర్‌కు ఛాతీలో ఇన్ఫెక్షన్ వచ్చిందని.. కోలుకోవడానికి టైం పడుతుందని మంత్రి తెలిపారు. తాజాగా ముఖ్యమంత్రి ఆరోగ్యంపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ నేత, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్. కేసీఆర్ తనకు గురువని, ఆయనను చూసే తాను మాటలు నేర్చుకున్నానని వెల్లడించారు. 

కేసీఆర్ ఆరోగ్యం ఎలా వుందో వివరాలు బయటపెట్టాలని.. సీఎంను ప్రజలకు చూపించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కనిపించకపోవడం తనను బాధిస్తోందని.. ఆయనకు భద్రతను కల్పించాలని సంజయ్ కోరారు. ఈ వ్యవహారంలో తనకు కేటీఆర్‌పై అనుమానం వస్తోందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. పదేళ్ల కాలంలో బీఆర్ఎస్ చేసిందేమీ లేదని.. 5 కోట్ల రూపాయలు అప్పులు చేశారని బండి సంజయ్ దుయ్యబట్టారు. బీజేపీ అధికారంలోకి వస్తేనే రుణభారం తీరుతుందని ఆయన పేర్కొన్నారు. 

ALso Read: కేసీఆర్ ఎక్కడ : సీఎం ఆరోగ్యంపై వదంతులు, కేటీఆర్ క్లారిటీ.. టైం పడుతుందంటూ కామెంట్స్

కాగా.. బండి సంజయ్ కొద్దిరోజుల క్రితం మీడియాతో మాట్లాడుతూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు. 15 రోజులుగా సీఎం కేసీఆర్ కనిపించడం లేదని.. కేటీఆర్‌పై అనుమానంగా వుందంటూ వ్యాఖ్యానించారు. మోడీపై కేసీఆర్ కుమారుడు అజయ్ రావు విషం నింపుకున్నాడని.. 4 కోట్ల మంది కోసం తెలంగాణ తెచ్చుకుంటే అది నలుగురి పాలైందని బండి సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. మోడీ తెలంగాణ పర్యటన తర్వాత బీఆర్ఎస్‌లో ప్రకంపనలు మొదలయ్యాయని ఆయన అన్నారు. సీఎం కేసీఆర్‌తో ఒక ప్రెస్‌మీట్ పెట్టించాలని.. మా ముఖ్యమంత్రిని ఒకసారి చూపించాలంటూ సంజయ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

కేసీఆర్‌ను కేటీఆర్ ఏమైనా చేశారా ? ఏమైనా ఇబ్బంది పెడుతున్నాడా..? ఎందుకంటే ఆయన మా సీఎం.. ఆయనను కాపాడుకోవాల్సిన బాధ్యత మాపై ఉందని సంజయ్ వ్యాఖ్యానించారు. కేసీఆర్ ప్రెస్‌మీట్ పెడితేనే ఆయన క్షేమంగా వున్నారని నమ్ముతామని అన్నారు.  కేసీఆర్ దగ్గరకు ఎవరినీ వెళ్లనీయడం లేదని.. అఖరికి ఎంపీ సంతోష్‌రావును కూడా దూరం పెట్టారని ఆరోపించారు. కేసీఆర్ కనబడితే క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నట్టుగా సంజయ్ చెప్పారు. నిజామాబాద్‌లో మోదీ చేసిన వ్యాఖ్యలపై కేసీఆర్ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. 

మోదీని ప్రపంచ దేశాలు ఒక హీరోలా చూస్తున్నాయని అన్నారు. దేశ ప్రధాని మీద బీఆర్ఎస్, కేసీఆర్ కుటుంబం చిల్లర ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో నలుగురు మాత్రమే బాగుండాలని కొరుకుంటున్నారని బీఆర్‌ఎస్‌పై బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. వేరే వ్యక్తి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఎందుకు కావడం లేదని ప్రశ్నించారు. మోదీ పర్యటన తర్వాత ప్రగతిభవన్‌లో భూకంపం వస్తుందని అన్నారు. మోదీ కుండబద్దలు కొట్టినట్టుగా మాట్లాడితే కేసీఆర్ కుటుంబంలో లొల్లిలు మొదలయ్యాయని అన్నారు. 


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios