Asianet News TeluguAsianet News Telugu

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు కరోనా పరీక్ష: రిజల్ట్...

తెలంగాణాలో ఏకైక బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు కరోనా నెగటివ్ అని తేలింది.  రాజా సింగ్ డ్రైవర్ కి కరోనా వైరస్ సోకడంతో ముందు జాగ్రత్తగా రాజా సింగ్ కు ఆయన కుటుంబ సభ్యులకు, కొందరు కార్యకర్తలకు కరోనా పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. 

BJP MLA Rajasingh Tests Negative For Coronavirus
Author
Hyderabad, First Published Jun 22, 2020, 4:41 PM IST

తెలంగాణాలో ఏకైక బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు కరోనా నెగటివ్ అని తేలింది.  రాజా సింగ్ డ్రైవర్ కి కరోనా వైరస్ సోకడంతో ముందు జాగ్రత్తగా రాజా సింగ్ కు ఆయన కుటుంబ సభ్యులకు, కొందరు కార్యకర్తలకు కరోనా పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. 

ఆయన తన ట్విట్టర్ వేదికగా తనకు కరోనా పరీక్షల్లో నెగటివ్ వచ్చిందని తెలిపాడు. శ్రీరాముడి కృపవల్ల, గోమాత ఆశీర్వాదం వల్ల తనకు, తన కుటుంబసభ్యులందరికీ కరోనా నెగటివ్ వచ్చిందని అన్నారు. తాన ఆరోగ్యం కోసం ప్రార్థించినవారందరికి ధన్యవాదాలు తెలిపాడు. 

తెలంగాణలో కరోనా కేసులు కనీవినీ ఎరుగని రీతిలో పెరిగిపోతున్నాయి. ఆదివారం ఢిల్లీ, మహారాష్ట్ర, తమిళనాడుతో పోటీపడుతూ రికార్డు స్థాయిలో ఒక్కరోజులో 730 కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి తెలంగాణలో కేసుల సంఖ్య 7,802కి చేరుఇకపోతే... కుంది. ఇవాళ వైరస్ కారణంగా ఏడుగురు మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య 210కి చేరింది.

రాష్ట్రంలో ప్రస్తుతం 3,861 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా.. 3, 731 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఆదివారం నమోదైన కేసుల్లో ఒక్క హైదరాబాద్‌లోనే 659 మందికి పాజిటివ్‌గా తేలడంతో ప్రభుత్వ వర్గాలు ఉలిక్కిపడ్డాయి.

ఆ తర్వాత జనగామ 34, రంగారెడ్డి 10, మేడ్చల్ 9, అసిఫాబాద్ 3, వరంగల్ 6, వికారాబాద్‌లో రెండు కేసులు, సంగారెడ్డి, ఆదిలాబాద్, నారాయణ్‌పేట్, మెదక్, నల్గొండ, యాదాద్రి, భద్రాద్రిలో ఒక్కో కేసు నమోదయ్యాయి. 

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావుకు కరోనా సోకింది. ఆయన ఆపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అస్వస్థతకు గురైన వి. హనుమంతరావు శనివారం నాడు ఆపోలో ఆసుపత్రిలో చేరడంతో వైద్యులు ఆయనకు కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో ఆయనకు పాజిటివ్‌గా తేలింది.

మరో వైపు ఇప్పటికే రాష్ట్రంలోని ముగ్గురు ఎమ్మెల్యేలు కూడ కరోనా బారినపడ్డారు. తొలుత జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా కరోనాతో చికిత్స పొందుతున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios