కారణమిదీ: వరంగల్‌లో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్
ఉమ్మడి వరంగల్ జిల్లాలో టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల ఘర్షణ నేపథ్యంలో వరంగల్ కు వెళ్తున్న బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.
వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల ఘర్షణ నేపథ్యంలో వరంగల్ కు వెళ్తున్న బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.
అయోధ్యలో రాముడి ఆలయ నిర్మాణానికి చందాల విషయంలో పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.ఈ వ్యాఖ్యల నేపథ్యంలో ధర్మారెడ్డి ఇంటిపై బీజేపీ కార్యకర్తలు దాడికి దిగారు. ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకొంది.
ఈ విషయమై వరంగల్ వెళ్తున్న ఎమ్మెల్యే రాజాసింగ్ ను పోచంపల్లి వద్ద పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు.అయోధ్యలో రామాలయం నిర్మాణానికి సంబంధించి విరాళాల విషయంలో బీజేపీ నేతలపై ధర్మారెడ్డి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.
అయోధ్యలో రామాలయానికి విరాళాల విషయంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు చేసిన వ్యాఖ్యలపై బీజేపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ వ్యాఖ్యలను నిరసిస్తూ పలు చోట్ల నిరసనలు వ్యక్తం చేశాయి. ఇదే విషయమై పలు చోట్ల రెండు పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకొంది.