పుల్వామాలో మన సైనికులపై జరిగిన ఉగ్రదాడిపై భారత్ ప్రతీకార చర్యకు దిగింది. ఇవాళ తెల్లవారుజామున భారత వాయుసేనకు చెందిన విమానాలు పాక్ ఆక్రమిత కశ్మీర్‌తో పాటు పాక్ భూభాగం మరో సర్జికల్ స్ట్రైక్స్‌ చేపట్టాయి. ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా గగనతల దాడులకు దిగింది. దీంతో దాదాపు 300 మంది ఉగ్రవాదులు మృతిచెందారు. భారత ప్రభుత్వం తీసుకున్న ఈ సాహసోపేత నిర్ణయంపై బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందిస్తూ ఓ వీడియో విడుదల చేశారు. 

పుల్వామా దాడి జరిగిన  తర్వాత ప్రతి భారతీయుడు పాక్ పై ప్రతీకారం తీర్చుకోవాలని కోరుకున్నాడు. వారు కోరుకున్నట్లు ఇవాళ పాక్ కు దీటుగా జవాభిస్తూ భారత సైన్యం, ప్రధాని మోదీ ప్రతీకారం  తీర్చుకుంది. దాదాపు వెయ్యి కిలోల పేలుడు పదార్ధాలతో ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసి ఓ కొత్త చరిత్ర సృష్టించారు. 

ఇలా గతంలో గానీ, భవిష్యత్ లో గానీ ఎప్పుడూ జరగలేదన్నారు. ప్రధాని నిర్ణయాన్ని భారత సైన్యం  అత్యంత చాకచక్యంతో అమలుచేసిందన్నారు. ఈ దాడుల్లో దాదాపు 300 మంది ఉగ్రవాదులు హతమైనట్లు తెలుస్తోందని రాజాసింగ్ వెల్లడించారు.

ప్రధాని ఏమీ చేయరని అరుస్తున్న కుక్కలకు ఇది దీటైన జవాబని రాజాసింగ్ ఘాటుగా విమర్శలు చేశారు. ఇది కేవలం శాంపిల్ మాత్రమేనని...మొత్తం పాకిస్థాన్ ను తగలబెట్టడం మిగిలివుందని ఆ కుక్కలకు హెచ్చరిస్తున్నానని అన్నారు. 

పాకిస్థాన్  వద్ద కొంత సమయం మిగిలివుంది. మేమైతే ప్రారంభించాం...పాకిస్థాన్ ఎలా స్పందిస్తుందోనని ఎదురుచూస్తున్నామని అన్నారు. ఆ దేశం ఏమైనా దుశ్చర్యకు పాల్పడితే కాశ్మీర్ వుంటుంది కానీ  పాకిస్థాన్ వుండదని రాజాసింగ్ హెచ్చరించారు. 

వీడియో

"