ఐదేళ్ల నాటి బొల్లారం దాడి కేసులో ఏడాది జైలు శిక్షకు గురైన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. పోలీసులపై దాడి దురుసుగా ప్రవర్తించారనే ఆరోపణపై రాజాసింగ్ మీద 2015లో కేసు నమోదైంది

ఐదేళ్ల నాటి బొల్లారం దాడి కేసులో ఏడాది జైలు శిక్షకు గురైన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. పోలీసులపై దాడి దురుసుగా ప్రవర్తించారనే ఆరోపణపై రాజాసింగ్ మీద 2015లో కేసు నమోదైంది.

రాజాసింగ్ బీఫ్ ఫెస్టివల్ ను అడ్డుకున్నారు. ఈ సంద్రభంగా పోలీసులు ఆయనను అరెస్టు చేశారు కూడా. ఈ సందర్భంగా జరిగిన వాగ్వివాదంలో రాజాసింగ్ సీఐని దూషించారంటూ కేసు నమోదైంది. 

Also Read:నాంపల్లి కోర్టు సంచలన తీర్పు: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు జైలు శిక్ష

అంతకు ముందు కూడా రాజాసింగ్ మీద కేసు నమోదైంది. విధి నిర్వహణలో ఉన్న కానిస్టేబుల్ మీద దాడిచేయడమే కాకుండా చంపేస్తానంటూ కూడా బెదిరించారు. దీంతో బాధిత కానిస్టేబుల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనపై కేసు నమోదైంది.