Asianet News TeluguAsianet News Telugu

‘‘6నెలలు కాదు.. జీవితకాలం నిషేధించాలి’’ కత్తి మహేష్ పై బిజేపీ నేత

శ్రీరాముడిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకుగాను.. కత్తి మహేష్ ని నగరం నుంచి 6నెలల పాటు బహిష్కరించిన సంగతి తెలిసిందే. 
 

bjp mla raja singh demands to ban on  kathi mahes life time

సినీ క్రిటిక్ కత్తి మహేష్ పై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మండిపడ్డారు. ఆయనను 6నెలలు కాదు.. జీవితకాలం నగరంలో అడుగుపెట్టకుండా నిషేధించాలని ఆయన అభిప్రాయపడ్డారు. శ్రీరాముడిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకుగాను.. కత్తి మహేష్ ని నగరం నుంచి 6నెలల పాటు బహిష్కరించిన సంగతి తెలిసిందే. 

ఈ నేపథ్యంలోనే స్వామి పరిపూర్ణానందను పోలీసులు హౌజ్ అరెస్టు చేశారు. కాగా.. ఆయనను కలిసేందుకు వచ్చిన ఎమ్మెల్యే రాజా సింగ్ మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్‌ నుంచి శాశ్వతంగా కత్తి మహేష్‌ను బహిష్కరించాలని, జీవితకాలం పాటు నిషేధం విధించాలని డిమాండ్‌ చేశారు. ఎమ్మెల్యేలుగా స్వామి పరిపూర్ణానందను కలిసేందుకు వస్తే పోలీసులు అనుమతి ఇవ్వలేదని, దీనిపై డీజీపీకి ఫిర్యాదు చేస్తామన్నారు.

ఎమ్మెల్యే రాజాసింగ్ తోపాటు ఉప్పల్ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ కూడా అక్కడికి వచ్చారు. ఆయన మాట్లాడుతూ..స్వామి పరిపూర్ణానందను హౌస్ అరెస్ట్ చేయడాన్ని  ఖండించారు. కత్తి మహేష్‌ను అరెస్ట్ చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ రెచ్చగొట్టే విధంగా మాట్లాడితే ప్రభుత్వానికి పట్టదా అని ప్రశ్నించారు. స్వామిజీ శాంతియుతంగా ధర్మాగ్రహ యాత్ర చేస్తామంటే ఎందుకు నిర్బంధించారని నిలదీశారు. కాగా, స్వామి పరిపూర్ణానందను కలిసేందుకు వచ్చిన ఇద్దరు ఎమ్మెల్యేలతో పాటు సినీ నటి కరాటే కల్యాణిని కూడా పోలీసులు అడ్డుకున్నారు.  

Follow Us:
Download App:
  • android
  • ios