అమర్‌నాథ్ ఆలయానికి సమీపంలో సంభవించిన ఆకస్మిక వరద బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే అమర్ నాథ్ యాత్రకు వెళ్లిన తెలంగాణకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్.. వరద బీభత్సం సృష్టించిన ప్రాంతం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. 

అమర్‌నాథ్ ఆలయానికి సమీపంలో సంభవించిన ఆకస్మిక వరద బీభత్సంలో మృతుల సంఖ్య 15కు చేరింది. మరో 40 మంది గల్లంతయ్యారు. అయితే అమర్ నాథ్ యాత్రకు వెళ్లిన తెలంగాణకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్.. వరద బీభత్సం సృష్టించిన ప్రాంతం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. ఈ మేరకు ఆయన వివరాలు వెల్లడించారు. . తమకు కొద్ది దూరంలోనే వరద ప్రవాహంలో భక్తులు కొట్టుకుపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయని చెప్పారు. 

ఘటన జరిగిన ప్రాంతానికి ఒక కిలోమీటర్లు దూరంలోనే ఉన్నట్టుగా చెప్పారు. తన కుటుంబం, తాను అమర్ నాథ్ యాత్రలో దర్శనం చేసుకున్నట్టుగా చెప్పారు. నిన్న ఘటన జరిగిన ప్రాంతంలోనే ఉన్నానని చెప్పారు. తాము భోజనం చేసిన ప్రాంతం సర్వ నాశనం అయిందన్నారు. తాము కిలో మీటర్ దూరం వెళ్లాక అక్కడ వదరలు వచ్చాయని చెప్పారు. జీవితంలో అలాంటి పరిస్థితి ఎప్పుడు చూడలేదని చెప్పారు. ఆర్మీ సేవలను కొనియాడారు. 

‘‘వాతావరణం అకస్మాత్తుగా మారిపోయింది. వాతావరణం క్షీణించిందని మేము గ్రహించాము. ఆ పరిస్థితులలో చాపర్ సేవ కూడా రద్దు చేయబడుతుంది. కాబట్టి మేము గుర్రాలను ఉపయోగించి కొండలు దిగాలని నిర్ణయించుకున్నాము. నేను ఉన్న కొద్ది దూరంలోనే వరద బీభత్సం సృష్టించాయి. అనేక గుడారాలు వరదలో కొట్టుకుపోయాయి’’ అని రాజాసింగ్ చెప్పారు. తన కుటుంబంతో కలిసి శ్రీనగర్ చేరుకోగలిగానని చెప్పారు. ఇందుకు సైన్యం సాయం చేసిందని చెప్పారు. 

తెలంగాణ సహా వివిధ రాష్ట్రాలకు చెందిన వారు అక్కడ చిక్కుకుపోయారని తెలిపారు. శుక్రవారం దర్శనం కోసం అమరాంత్ గుహలో వేలాది మంది భక్తులు ఉన్నారు. కొండల గుండా నీరు ప్రవహిస్తోంది. కొన్ని గుడారాలను తుడిచిపెట్టింది. నా అంచనా ప్రకారం కనీసం 50 మంది ఆకస్మిక వరదలో కొట్టుకుపోయారు. సైన్యం అమర్‌నాథ్ గుహలో గొప్ప పని చేస్తోంది. వారు ఎప్పటికప్పుడు వాతావరణ పరిస్థితులపై భక్తులను హెచ్చరిస్తూనే ఉన్నారు. కానీ ఒక్కసారిగా ఇలా జరగడంతో వారు కూడా చేయలేకపోయారు. వెంటనే అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టారు’’ అని తెలిపారు.