Asianet News TeluguAsianet News Telugu

మొబైల్‌ను ఎందుకు దాచిపెట్టారు: మంత్రి మల్లారెడ్డిని ప్రశ్నించిన బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు

తన మొబైల్  ఫోన్ ను  మంత్రి  మల్లారెడ్డి  ఎందుకు  దాచారో  చెప్పాలని  బీజేపీ  ఎమ్మెల్యే  రఘునందన్ రావు  ప్రశ్నించారు.  
 

BJP  MLA   Raghunandan Rao  slams  Minister  Malla  Reddy
Author
First Published Nov 23, 2022, 1:26 PM IST


హైదరాబాద్: తన మొబైల్ ను  మంత్రి  మల్లారెడ్డి  ఎందుకు  దాచారో చెప్పాలని  బీజేపీ  ఎమ్మెల్యే  రఘునందన్ రావు  ప్రశ్నించారు. బీజేపీ  ఎమ్మెల్యే  రఘునందన్ రావు  బుధవారంనాడు  బీజేపీ కార్యాలయంలో  మీడియాతో  మాట్లాడారు.
ఈ మధ్య ఎవరికి ఐటీ నోటీసులు ఇచ్చినా  అస్వస్థత పేరుతో హాస్పిటల్ కి వెళ్తున్నారన్నారు. బాధ్యత గల మంత్రి స్థానంలో ఉన్న మల్లారెడ్డి  ఐటీ  సోదాలను రాజకీయ కోణంలో చూస్తున్నారన్నారు.ఐటీ లో కక్ష సాధింపు ఉండదన్నారు. చట్టం ముందు అందరూ సమానులేనని  రఘునందన్  రావు  తెలిపారు.రేపు తనకు  నోటీసు ఇచ్చినా  సమాధానం చెప్పాల్సిందేనన్నారు. 

also read:మంత్రి మల్లారెడ్డి బంధువు ప్రవీణ్ రెడ్డికి అస్వస్థత: ఆసుపత్రికి తరలింపు

 నిజాయితీ గా పన్నులు చెల్లించినప్పుడు  మంత్రి మల్లారెడ్డి ఎందుకు  భయపడుతున్నారో  చెప్పాలని ఆయన  ప్రశ్నించారు. ఐటీ  అధికారులు వస్తే ఎందుకు తలుపులు తీయడం లేదో చెప్పాలని  మంత్రిని రఘునందన్  రావు  అడిగారు. గనులు,ఫార్మా,కాలేజీల వ్యాపారాలు చేస్తూ   పన్నులు  కట్టని వారిపై దాడులు జరుగుతున్నాయని  ఎమ్మెల్యే  చెప్పారు. తమ అధికారాన్ని అడ్డుపెట్టుకుని వ్యాపారాలు చేసే వారిపై దర్యాప్తు  సంస్థలు  కేంద్రీకరించాయని  ఎమ్మెల్యే  తెలిపారు.  బీజేపీ  జాతీయ  నేత బిఎల్ సంతోష్ కేసు కోర్టులో ఉన్నందున  తాను  ఈ  విషయమై ఎక్కువగా  మాట్లాడలేనన్నారు.కోర్టు ఇచ్చే తీర్పు గౌరవిస్తామని  తెలిపారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి కూడా కాలేజీలు నడుపుతున్నారన్నారు కొన్ని కాలేజీలకు ఐటి కడుతున్నారు..కొన్నటికి కట్టడం లేదు అనుకుంటానని  తెలిపారు. టాక్స్ కట్టకపోతే కట్టాలి..అంతే తప్ప ఉరి తీస్తారా అని ఎమ్మెల్యే  ప్రశ్నించారు.  ఫారెస్ట్ అధికారి శ్రీనివాస్ రావు చనిపోవడం బాధాకరంగా  ఆయన  పేర్కొన్నారు. పోడు భూములు సాగుచేసుకుంటున్న వాటికి పట్టాలు ఇవ్వాలని ఏడాదిగా అడుగుతున్నారన్నారు.గిరిజనులు చేసింది తప్పేనని ఆయన తెలిపారు.  ఈ  ఘటనకు  రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాల్సిందేనన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios