మెదక్‌ జిల్లా (medak district) హావేలి ఘనపూర్‌ (haveli ghanpur)మండలంలో శనివారం బీజేపీ (bjp) నేత ఈటల రాజేందర్ (etela rajender) పర్యటించారు. శుక్రవారం బోగడ భూపతిపూర్‌లో (boguda bhupathipur) ఆత్మహత్య చేసుకున్న రైతు రవి కుటుంబాన్ని ఆయన పరామర్శించి, ఓదార్చారు.

మెదక్‌ జిల్లా (medak district) హావేలి ఘనపూర్‌ (haveli ghanpur)మండలంలో శనివారం బీజేపీ (bjp) నేత ఈటల రాజేందర్ (etela rajender) పర్యటించారు. శుక్రవారం బోగడ భూపతిపూర్‌లో (boguda bhupathipur) ఆత్మహత్య చేసుకున్న రైతు రవి కుటుంబాన్ని ఆయన పరామర్శించి, ఓదార్చారు. అనంతరం ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడుతూ... రైతు రవి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. తక్షణ సాయంగా రూ.50 వేలు ఆందజేసినట్టు ఈటల చెప్పారు. వరి వేయొద్దని సీఎం చెప్పడం హాస్యాస్పదమని... బియ్యం తీసుకోవడానికి కేంద్రం సిద్ధంగా ఉందని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. వానాకాలం ధాన్యం మొత్తం వెంటనే సేకరించాలని ఆయన డిమాండ్‌ చేశారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కేసీఆర్‌ (kcr) ఇచ్చిన హామీలను విస్మరించారని రాజేందర్ ఆరోపించారు. ఉప ఎన్నిక వస్తేనే ప్రభుత్వం పనిచేస్తుందా అంటూ ఆయన దుయ్యబట్టారు.

కాగా.. హావేలి ఘనపూర్ మండలం బోగడ భూపతి పూర్ లో రైతు కర్ణం రవి కుమార్ స్వయంగా కేసీఆర్‌కు లేఖ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయ‌న పొలానికి నీళ్లు సౌక‌ర్యం ఉంది. దీంతో వర్షాకాలంలో ప్ర‌భుత్వం చెప్పిన‌ట్టు సన్నరకం వరి వేశాడు. కానీ, ఊహించ‌ని విధంగా దిగుబడి తక్కువగా వచ్చింది. అయినా స‌రే.. పంట‌కు స‌రైన మ‌ద్ద‌తు రాక‌పోదా అని చూశాడు. కానీ, దొడ్డు ర‌కం వ‌డ్లు వ‌చ్చిన ధ‌ర‌నే స‌న్నాలకు ల‌భించింది. స‌రేలే అని స‌ర్దుకుపోయాడు. యాసంగి లో పుష్కల‌మైన నీరు ఉంది.. మంచి దిగుబడి వ‌స్తోందని సాగు చేయాల‌ని భావించాడు.

ALso Read:కేసీఆర్ కు లేఖ రాసి రైతు ఆత్మహత్య

కానీ తెలంగాణ స‌ర్కార్ .. ఎట్టి ప‌రిస్థితుల్లో వ‌రి సాగు చేయొద్ద‌ని సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. దీంతో ఏం పండించాలనేది అర్థం కాని గందరగోళం ప‌డ్డారు. ఏం చేయ‌లేని ప‌రిస్థితిలో పురుగుల మందు తాగి రైతు కరణం రవికుమార్ (40) ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు, ఈ క్ర‌మంలో త‌న బాధ‌ను వ్య‌క్త‌ప‌రుస్తూ.. సీఎం కేసీఆర్ కు లేఖ రాశాడు. 

’ప్రభుత్వం చెప్పినట్లు సన్నరకం వరి పండిస్తే దిగుబడి తక్కువ వచ్చింది. వచ్చిన పంటకు కనీస మద్దతు ధర లేదు. ఇప్పుడు యాసంగిలో వరి వేయొద్దని చెబుతున్నారు. పుష్కలంగా నీళ్లున్నాయి. నేను కౌలుదారులకు ఏం ఇయ్యాలె. నా తండ్రికి 60 ఏళ్లైనా పింఛను రావడం లేదు. నా కుమారుడు 8 తరగతి చదువుతున్నాడు. తనను ఇంజినీరింగ్ చదివియ్యాలె’ అంటూ త‌న ఆవేద‌న‌ను వ్య‌క్తం చేస్తూ.. సీఎం కేసీఆర్​కు రాసిన లేఖలో రవికుమార్ పేర్కొన్నాడు.