Asianet News TeluguAsianet News Telugu

ఒకప్పుడు కేసీఆర్ టీవీలో కనబడితే యువత కేరింతలు కొట్టేది.. కానీ ఇప్పుడు.. : ఈటల రాజేందర్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఉద్యమం నాటి కేసీఆర్‌కు.. ఇప్పటి కేసీఆర్‌కు చాలా తేడా ఉందన్నారు.

bjp mla etela rajender slams chief minister kcr
Author
First Published Jun 14, 2022, 4:15 PM IST | Last Updated Jun 14, 2022, 4:15 PM IST

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఉద్యమం నాటి కేసీఆర్‌కు.. ఇప్పటి కేసీఆర్‌కు చాలా తేడా ఉందన్నారు. సిద్దిపేటలో మోదీ 8 ఏళ్ల ప్రజాసంక్షేమ పాలన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు హాజరైన ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. ఒకప్పుడు కేసీఆర్ టీవీలో కనబడితే యువత కేరింతలు కొట్టేవారని.. ఇప్పుడు చీదరించుకుంటున్నారని అన్నారు. తాను పార్టీ మారలేదని.. టీఆర్ఎస్ వాళ్లే వెళ్లగొట్టారని వ్యాఖ్యానించారు. రెచ్చగొడితే ఆత్మగౌరవం కోసం రాజీనామా చేశానని చెప్పారు. 

పదవులు కోసం పెదాలు మూసే దద్దమ్మలు టీఆర్ఎస్ వాళ్లు అని తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్‌కు గోళీలు ఇచ్చేందుకు సంతోష్‌కు రాజ్యసభ పదవి ఇచ్చారని విమర్శించారు. సీఎం పదవిని కేసీఆర్ ఎడమకాలి చెప్పుతో పోల్చడం ప్రజలను అవమానించడమేనని అన్నారు. నల్లగొండ జిల్లా పర్యటనలో ప్రజలు తనకు బ్రహ్మరథం పడితే.. అధికారపార్టీకి చెందిన మీడియా ఖాళీ కుర్చీలు చూపించడాన్ని ఈటల తప్పుపట్టారు. 

మద్యం, బెల్ట్ షాప్‌లను కేసీఆర్ ఎందుకు పెంచుతున్నారని ప్రశ్నించారు. పబ్ ల కారణంగా అమ్మాయిల జీవితాలు అగమ్యగోచరంగా మారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో ఉన్న విష సంస్కృతిని బీఆర్‌ఎస్‌తో దేశం మొత్తం పంచుతారా అని కేసీఆర్‌ను ప్రశ్నించారు. రాష్ట్రంలో నెలకొన్న సమస్యలపై చర్చకు సిద్దంగా ఉన్నట్టుగా ఈటల వెల్లడించారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios