ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ఇంట విషాదం నెలకొంది. ఆయన తండ్రి ఈటెల మల్లయ్య అనారోగ్య సమస్యలతో కన్నుమూశారు. 

కమలాపూర్ : బిజెపి నేత, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ తండ్రి ఈటల మల్లయ్య (104) అనారోగ్యంతో మంగళవారం రాత్రి మృతి చెందారు. మల్లయ్యకు ఎనిమిది మంది సంతానం. ముగ్గురు కుమారులు, ఐదుగురు కుమార్తెలు. ఈటల రాజేందర్ రెండో కుమారుడు. చాలా రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న మల్లయ్యకు హైదరాబాదులోని ఆర్విఎం ఆస్పత్రి మెడికల్ కాలేజీలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో మంగళవారం రాత్రి ఆయన కన్నుమూశారు. మరణవార్తను ఈటెల కుటుంబీకులు ధ్రువీకరించారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

హనుమకొండ జిల్లా కమలాపూర్ లోని స్వగ్రామంలో పార్థివదేహాన్ని ఉంచి, మధ్యాహ్నం అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబీకులు తెలిపారు. బుధవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో అంత్యక్రియలు నిర్వహిస్తామని ఈటెల కుటుంబీకులు తెలిపారు. ఈటెల మల్లయ్య మృతితో కమలాపూర్ లో విషాద ఛాయలు అలుముకున్నాయి. మల్లయ్యను చూసేందుకు, ఈటెలను పరామర్శించేందుకు బీజేపీ కార్యకర్తలు తరలి వస్తున్నారు.