Asianet News TeluguAsianet News Telugu

ఎంఐఎం-బీజేపీల మధ్య మాటల యుద్ధం

తెలంగాణలో బీజేపీ, ఎంఐఎం పార్టీల మధ్య మాటల యుద్ధం తారా స్థాయికి చేరింది. సవాల్ ప్రతిసవాల్ తో రాజకీయ వేడి రగలుస్తున్నాయి ఇరు పార్టీలు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా హైదరాబాద్‌లో పోటీచేసినా తమ పార్టీయే గెలుస్తుందని ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ వ్యాఖ్యానించారు. 

bjp-mim political war
Author
Hyderabad, First Published Sep 15, 2018, 8:30 PM IST

హైదరాబాద్‌: తెలంగాణలో బీజేపీ, ఎంఐఎం పార్టీల మధ్య మాటల యుద్ధం తారా స్థాయికి చేరింది. సవాల్ ప్రతిసవాల్ తో రాజకీయ వేడి రగలుస్తున్నాయి ఇరు పార్టీలు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా హైదరాబాద్‌లో పోటీచేసినా తమ పార్టీయే గెలుస్తుందని ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ వ్యాఖ్యానించారు. 

అమిత్‌షా పర్యటన నేపథ్యంలో అసదుద్దీన్‌ ట్వీటర్‌ వేదికగా పలు వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఉన్న ఐదు స్థానాలను కూడా బీజేపీ మళ్లీ ఎన్నికల్లో గెలవలేదని జోస్యం చెప్పారు. పెట్రోల్‌ ధరల నియంత్రణ, యువతకు ఉద్యోగ కల్పనపై బీజేపీ తమ నిర్ణయాలను వెల్లడించాలని డిమాండ్‌ చేశారు.

అసుదుద్దీన్ వ్యాఖ్యలపై బీజేపీ నేత కిషన్ రెడ్డి స్పందించారు. దమ్ముంటే అసదుద్దీన్ ఓవైసీ అంబర్ పేట్ నుంచి పోటీ చేసి తనపై గెలవాలని సవాల్ విసిరారు. టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలకు రాబోయే ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు.  

Follow Us:
Download App:
  • android
  • ios