తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్, గోషామహల్ తాజా మాజీ ఎమ్మెల్యే రాజాసింగ్‌లు సోమవారం నామినేషన్లు దాఖలు చేశారు. ముషీరాబాద్‌లోని విజయగణపతి ఆలయంలో ఉదయం 11 గంటలకు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం లక్ష్మణ్ పార్టీ నేతలు, కార్యకర్తలతో ర్యాలీగా ఎంఆర్‌ఓ కార్యాలయానికి చేరుకుని నామినేషన్ వేశారు.

రాజాసింగ్ ధూల్‌పేటలోని ఆకాశ్‌పురి హనుమాన్ దేవాలయంలో పూజలు నిర్వహించి అక్కడి నుంచి బీజేపీ రాష్ట్ర కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించనున్నారు. అనంతరం పార్టీ కార్యాలయంలో బీ ఫారం తీసుకుని.. అబిడ్స్‌లోని మున్సిపల్ కార్యాలయానికి చేరుకుని రాజాసింగ్‌ నామినేషన్ వేశారు.