Asianet News TeluguAsianet News Telugu

రైతుబంధు సంబురాలు ఎందుకు? కేసీఆర్‌పై విజయశాంతి ఫైర్

 సీఎం కేసీఆర్ పై బీజేపీ నాయ‌కురాలు విజ‌య‌శాంతి తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. ఊసరవెల్లి కేసీఆర్‌ను గద్దె దింపాలంటూ తెలంగాణ ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు. క‌రోనా విజృంభిస్తున్న వేళ‌.. ఎన్నాడు లేనిది రైతు బంధు పేరుతో రాజ‌కీయాలు చేస్తున్నారని ఆగ్ర‌హం చేశారు. అస‌లు ఎందుకు రైతుబంధు వారోత్సవాలు నిర్వ‌హిస్తున్నారని ప్ర‌శ్నించారు. కేసీఆర్ పాలనలో వేలాది మంది రైతుల ఉసురు తీసుకున్నందుకా? కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఫసల్ బీమా తెలంగాణలో అమలు చేయనందుకా.? దేనికి రైతు బంధు వారోత్సవాలు నిర్వహిస్తున్నారో క‌నీసం అన్నదాతలకైనా తెలపాలని డిమాండ్ చేశారు.
 

bjp leader vijayshanthi slams to cm kcr over farmers issues
Author
Hyderabad, First Published Jan 13, 2022, 5:16 PM IST

తెలంగాణ సీఎం కేసీఆర్ పై బీజేపీ నాయ‌కురాలు విజ‌య‌శాంతి తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. ఊసరవెల్లి కేసీఆర్‌ను గద్దె దింపాలంటూ తెలంగాణ ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు. విజ‌య‌శాంతి గురువారం  మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్‌పై తీవ్ర‌స్థాయిలో నిప్పులు చెరిగారు.  అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన కేసీఆర్ సర్కార్‌కు కాలం దగ్గరపడింద‌ని ఆగ్రహం వ్యక్తం చేశారు. క‌రోనా విజృంభిస్తున్న వేళ 
తెరాస గ‌త వారం రోజులుగా రైతుబంధు పేరుతో సంబురాలు చేయ‌డ‌మేమిట‌ని విమ‌ర్శించారు. అసలు  వడ్ల కొనుగోలును రైతులు మర్చిపోయేందుకు డ్రామాలు చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్..  ఊసరవెల్లి డ్రామాలను ప్రజలు గ్రహిస్తున్నారనీ, రానున్న ఎన్నిక‌ల్లో గద్దె దించడం ఖామని విజ‌య‌శాంతి  హెచ్చరించారు.

రైతులు యాసంగి వరిసాగు చేయొద్దని చెప్పి, కాదని వేస్తే కొనుగోలు చేయ‌మ‌ని రైతుల‌ను ఆగమాగం చేస్తున్నారని, ఆ విష‌యాన్ని మ‌రిచిపోయేలా.. ఊరూరా రైతుబంధు సంబురాలు చేస్తోన్నార‌ని మండిపడ్డారు. గ‌త వారం రోజులుగా తెరాస రాజ‌కీయ విన్యాసాల‌కు తెర‌లేపార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది.  రైతుల ప్ర‌తి స‌మ‌స్య‌కు సర్వరోగనివారిణి రైతుబంధే అన్నట్టు తెరాస ప్ర‌భుత్వం వ్య‌వ‌హ‌రిస్తోందని అన్నారు. కరోనా నిబంధనల్ని పూర్తిగా విస్మ‌రించి..  చారణ కోడికి బారాణ మసాలా అన్న‌ట్టు రైతుబంధు  ప్రచారం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. కానీ అసలు ఈ రైతుబంధు వారోత్సవాలు ఎందుకోసం? అని ప్రశ్నించారు.
 
రూ. లక్ష లోపు ఉన్న రైతుల పంట రుణాలను కేసీఆర్ మాఫీ చేయనందుకా? లేక రైతులందరికీ ఉచితంగా ఎరువులు ఇస్తానని కేసీఆర్ వాగ్దానం చేసి.. ఇయ్యనందుకా? పోనీ ఏడేండ్ల కేసీఆర్ ఏలుబడిలో వేలాది మంది రైతుల ఉసురు తీసుకున్నందుకా? లేక ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన హామీలు నెరవేర్చనందుకా? కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఫసల్ బీమాను రాష్ట్రంలో అమలు చేయందుకా? ఎందుకు ఈ రైతు బంధు వారోత్సవాలు నిర్వహిస్తున్నారో రాష్ట్ర ప్ర‌భుత్వం తెలంగాణ ప్ర‌జానీకానికి చెప్పాల‌ని  విజయశాంతి డిమాండ్‌ చేశారు. 

పంట రుణమాఫీ ఎందుకు చేయలేదని ప్రశ్నిస్తే రైతుల‌పై దాడులు చేయడం సిగ్గుచేటని విజయశాంతి ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్గొండ జిల్లాలో ఓ యువ రైతు రుణ‌మాఫీ ఎందుకు చేయాల‌ని ప్రభుత్వాన్ని నిలదీస్తే.. అధికారపార్టీ నేతలు తనని అడ్డుకొని కొట్టేందుకు ప్రయత్నించడం సిగ్గుచేటు అంటూ విమ‌ర్శించారు.  రాష్ట్రంలో ఉద్యోగులు, నిరుద్యోగులు, యువతరం అన్నివ‌ర్గాల ప్ర‌జల‌తో పాటు ఇప్పుడూ  రైతులను కూడా మోసగించాలని కేసీఆర్ చూస్తున్నార‌ని, కానీ రైతులు మోసపోయే స్థితిలో లేరంటూ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి చురకలు అంటించారు. ఇప్ప‌టికే కేసీఆర్  ఎత్తులు, జిత్తులు తెలంగాణ ప్ర‌జానీకం అర్థం చేసుకుంద‌నీ, వచ్చే ఎన్నికల్లో కేసీఆర్‌ ప్రజలు చావు దెబ్బ కొడతారంటూ విజ‌య‌శాంతి హెచ్చరించారు.

Follow Us:
Download App:
  • android
  • ios