కామారెడ్డిలో  నేను.. గజ్వెల్ లో బండి సంజయ్..: కేసీఆర్ తో పోటీపై విజయశాంతి రియాక్ట్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై బండి సంజయ్ తో పాటు తనను పోటీ చేయించాలని బిజెపి భావిస్తోందంటూ ప్రచారం జరుగుతోందని విజయశాంతి అన్నారు. అయితే  వ్యూహాత్మక నిర్ణయాలు ఎన్నడైనా పార్టీ నిర్దేశితమే అంటూ  విజయశాంతి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. 

BJP Leader Vijayashanti reacts on Kamareddy contest AKP

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల తర్వాత రాష్ట్ర రాజకీయాలు మరింత హీటెక్కాయి. ఇప్పటికే అభ్యర్థుల ప్రకటన,బీఫారాల పంపిణీతో పాటు ప్రచారంలోనే ముందుంది బిఆర్ఎస్. ప్రతిపక్ష కాంగ్రెస్, బిజెపి పార్టీలు ఇంకా అభ్యర్థుల వేటలో వుండగానే కేసీఆర్ రాష్ట్రాన్ని చుట్టేసే పనిలోపడ్డారు. ఇలా ప్రచారంలో దూసుకుపోతున్న కేసీఆర్ తాను పోటీచేసే నియోజకవర్గంపై పెద్దగా దృష్టిపెట్టకపోవచ్చు. దీంతో ఇక్కడ బలమైన అభ్యర్థులను బరిలోకి దింపి కేసీఆర్ ను ఓడించాలని... తద్వారా జాతీయ రాజకీయాలకు సిద్దమైన బిఆర్ఎస్ పార్టీని నైతికంగా దెబ్బతీయవచ్చని బిజెపి బావిస్తోందట. బిజెపి కార్యకర్తలు కూడా కేసీఆర్ పోటీచేసే గజ్వెల్, కామారెడ్డి నియోజకవర్గాల్లో బలమైన నాయకులను పోటీలోకి దింపాలని కోరుకుంటున్నారు. 

అయితే ఇప్పటికే కేసీఆర్ పై పోటీ చేస్తామని బిజెపి నాయకులు బండి సంజయ్, ఈటల రాజేందర్ లాంటి నాయకులు సవాల్ చేసారు. అలాగే గతంలో మెదక్ ఎంపీగా చేసిన విజయశాంతికి కామారెడ్డి నియోజకవర్గంపై కొంత పట్టు వుంది. ఈ క్రమంలోనే గజ్వెల్ నుండి సంజయ్, కామారెడ్డి నుండి విజయశాంతి సీఎం కేసీఆర్ పై  పోటీ చేయాలని బిజెపి శ్రేణులు కోరుకుంటున్నాయి. ఈ క్రమంలో కేసీఆర్ పై పోటీపై విజయశాంతి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. 
  
''బీఆర్ఎస్ పై రాజీలేని పోరాటం చేయడంలో బీజేపీ వెనక్కు తగ్గదని కార్యకర్తల విశ్వాసం. అందుకే గజ్వేల్ నుండి బండి సంజయ్, కామారెడ్డి నుండి నేను  కేసీఆర్ పై పోటీ చెయ్యాలని కోరుకుంటున్నారు. గత కొన్ని రోజుల పలు మీడియా,సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా కార్యకర్తలు ఈ విషయం గురించి అడుగుతున్నారు. ఇలా అడగటం ఏమాత్రం తప్పు కాదు. కానీ అసెంబ్లీ ఎన్నికల పోటీ నా ఉద్దేశ్యం కాదు... అయినా వ్యూహాత్మక నిర్ణయాలు ఎన్నడైనా పార్టీ నిర్దేశితమే అన్నది సత్యమైన వాస్తవం'' అంటూ కేసీఆర్ పై పోటీపై సస్పెన్స్ ను కొనసాగించారు విజయశాంతి. 

Read More  నిన్ను ‘కుక్కా’ అన్నా సింపతీ రాదు.. కవితపై అరవింద్ వివాదాస్పద వ్యాఖ్యలు..

ఇదిలావుంటే కాంగ్రెస్ పార్టీ గజ్వెల్ అభ్యర్థిగా టి. నర్సారెడ్డిని బరిలోకి దింపినా కామారెడ్డి అభ్యర్థిపై సస్పెన్స్ కొనసాగిస్తోంది. అక్కడ మాజీ మంత్రి షబ్బీర్ అలీ బలమైన నేతగా వున్నా కేసీఆర్ పై పోటీకి సుముఖంగా లేనట్లు సమాచారం. దీంతో అతడి స్థానంలో మరో అభ్యర్థిని కాంగ్రెస్ బరిలోకి దింపుతుందా లేదంటే ఆయననే ఒప్పిస్తుందో చూడాలి. ఇప్పటికయితే కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ అభ్యర్థుల జాబితాలో కామారెడ్డి లేదు.  
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios