హైద్రాబాద్: హైద్రాబాద్ నాచారంలో కార్పోరేటర్ టికెట్టు దక్కకపోవడంతో విజయలతారెడ్డి గురువారంనాడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.

గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడ ఆమె పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ కారణంగానే తనకు ఈ దఫా టికెట్టు రాలేదని ఆమె మనస్తాపానికి గురయ్యారు.  దీంతో ఆత్మహత్యాయత్నం చేశారు.

ఈ విషయాన్ని గుర్తించిన కుటుంబసభ్యులు ఆమెను వెంటనే ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. ఆసుపత్రిలో ఆమె చికిత్స పొందుతోంది.

టికెట్టు దక్కలేదని  నిరసనలకు పాల్పడ్డవద్దని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పార్టీ క్యాడర్ ను హెచ్చరించాడు. ఒకవేళ పార్టీకి వ్యతిరేకంగా పని చేస్తే శాశ్వతంగా పార్టీ నుండి సస్పెండ్ చేస్తామని ఆయన హెచ్చరించారు.

జీహెచ్ఎంసీ ఎన్నికలను బీజేపీ సీరియస్ గా తీసుకొంది. ఈ ఎన్నికల్లో గెలుపు గుర్రాలనే బీజేపీ బరిలోకి దింపాలని భావిస్తోంది. టీఆర్ఎస్ కు ఈ ఎన్నికల్లో చెక్ పెట్టాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది. జీహెచ్ఎంసీని కైవసం చేసుకొనేందుకు ఆ పార్టీ ప్రయత్నాలు చేస్తోంది. నియోజకవర్గాలకు ఇంచార్జీలను నియమించింది.ఈ ఎన్నికల కోసం ప్రత్యేకంగా భూపేంద్ర యాదవ్ ను బీజేపీ ఇంచార్జీగా నియమించింది.