Asianet News TeluguAsianet News Telugu

BJP: బీజేపీకి వరుస షాకులు.. గంటల వ్యవధిలోనే కీలక నేతల రాజీనామా..

BJP: తెలంగాణ బీజేపీ రెండు వరుస షాకులు తగిలాయి. బుధవారం ఉదయం మాజీ ఎంపీ వివేక్‌ వెంకటస్వామి రాజీనామా బీజేపీకి రాజీనామా చేయడం తెలిసిందే. కొన్ని గంటల్లోనే మరో నేత పార్టీకి ఉద్వాసన పలికారు. 

Bjp Leader Rakesh Reddy Resign To Party Emotional In Front Of Media KRJ
Author
First Published Nov 1, 2023, 6:51 PM IST

BJP: తెలంగాణ రాజకీయాలు రోజు రోజుకు ఆసక్తికరంగా మారుతున్నాయి. పార్టీ టికెట్ ఆశించిన ఆశావాహ నేతలు టికెట్లు రాకపోవడంతో ఫిరాయింపుల పర్వానికి తెర తీస్తున్నారు. అటు అధికార పార్టీలోనూ.. ఇటు ప్రతిపక్ష పార్టీలోనూ ఇదే ధోరణి కొనసాగుతోంది. తాజాగా ప్రతిపక్ష బిజెపికి వరుసగా షాకులు తగులుతున్నాయి. ఇప్పటికీ పలు కీలక నేతలు పార్టీకి ఉద్వాసన పలకగా ఈరోజు ఉదయం మాజీ ఎంపీ వివేక్ వెంకట స్వామి రాజీనామా చేసి.. భారీ షాకిచ్చారు.

ఆ షాక్ నుండి తీరుకోక ముందే.. మరో కీలక నేత కూడా  పార్టీకి రాజీనామా చేశారు. తాజాగా రాష్ట్ర అధికార ప్రతినిధి గా కొనసాగుతున్న రాకేష్ రెడ్డి కూడా బీజేపీకి రాజీనామా చేశారు. తనకు  వరంగల్ పశ్చిమ టిక్కెట్ దక్కపోవడంతో ఈ కీలక నిర్ణయం తీసుకున్నానని, తన కార్యకర్తలతో కలిసి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

బీజేపీకి రాజీనామా చేసిన అనంతరం రాకేష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఉద్వేగానికి గురయ్యారు. తన జన్మభూమికి కోసం.. ప్రజలకు సేవ చేయాలని అంకితం భావంతో పని చేశానని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు సేవాల చేయాలని తాను ఉన్నత ఉద్యోగాలను వదులుకొని 2013లో వరంగల్ గడ్డమీద అడుగుపెట్టానని తెలిపారు. నాటి నుండి నేటి వరకు.. దాదాపు 11 యేండ్ల ప్రస్థానంలో పార్టీనే కుటుంబంగా, పార్టీ కార్యకర్తలను తన కుటుంబ సభ్యులుగా భావించానని అన్నారు. ఈ ప్రస్థానంలో తాను కార్యకర్త స్థాయి నుండి బిజెపి అధికార ప్రతినిధిగా ఎదిగానని అన్నారు. 

ఈ మేరకు తాను వంద శాతం శక్తివంతులు లేకుండా కృషిచేసినని అన్నారు. తన రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది కుటుంబాలను కలిసి మాట్లాడాననీ,తనకు టిక్కెట్ ఇవ్వాలని అడిగితే..  తనకు ఇంకా భవిష్యత్ ఉందని పార్టీ పెద్దలు చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.దేశ భవిత యువత చేతుల్లో ఉందని అంటున్నారు కానీ, బీజేపీలో ఆ పరిస్థితి లేదన్నాని విమర్శించారు. వయసు మీద పడ్డాక, వృద్ధాప్యంలో టికెట్ ఇస్తే ఫలితం ఏముంటుందని ప్రశ్నించారు. తాను పార్టీ కోసం ఎంతగానో పనిచేసినా గుర్తింపు దక్కడం లేదన్నారు. సర్వేలన్నీ తనవైపే ఉన్నాయనీ, ప్రజల్లో తనకు అభిమానం ఉందని..అయితే.. టికెట్ మాత్రం ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు.

Follow Us:
Download App:
  • android
  • ios