హైదరాబాద్: తెలంగాణలో సీఎం కేసీఆర్ కనుసన్నల్లో కాంగ్రెస్ పార్టీ నడుస్తోందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఆరోపించారు.ఆదివారం నాడు హైద్రాబాద్‌లోని బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.  పీవీ కుమార్తె సురభి వాణీదేవిని అడ్డం పెట్టుకొని ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిచిందన్నారు.

 అలాగే దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు షర్మిలను అడ్డం పెట్టుకొని  వచ్చే ఎన్నికల్లో గెలవాలని టీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు.నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ నేత జానారెడ్డిని గెలిపించేందుకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో చిన్నారెడ్డి, రాములునాయక్ లను బలి పశువులు చేశారని ఆయన విమర్శించారు.టీఆర్ఎస్ నేతల ప్రయత్నాలు నాగార్జునసాగర్ లో కాంగ్రెస్ ను గెలిపించేలా ఉన్నాయన్నారు.రైతులకు పసుపు బోర్డే కావాలనుకొంటే కేంద్రంతో మాట్లాడుతామని ఆయన చెప్పారు.

ఈ ఏడాది ఏప్రిల్ 17వ తేదీన నాగార్జునసాగర్ ఉప ఎన్నికలకు ఎన్నికలు జరగనున్నాయి.ఈ ఎన్నికల్లో విజయం సాధించేందుకు టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధులను టీఆర్ఎస్, బీజేపీలు ఇంకా ప్రకటించలేదు.