Asianet News TeluguAsianet News Telugu

సంక్రాంతి తర్వాత కేసీఆర్ కనుసన్నల్లో కొత్త ప్రాంతీయ పార్టీ.. బీజేపీ నేత ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు..

బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు  చేశారు. సీఎం కేసీఆర్ తెలంగాణ పాలనను గాలికొదిలేశారని విమర్శించారు. సంక్రాంతి తర్వాత కేసీఆర్ కనుసన్నల్లో కొత్త ప్రాంతీయ పార్టీ రాబోతుందని అన్నారు.

BJP Leader NVSS Prabhakar sensational comments on KCR And Jagan
Author
First Published Jan 5, 2023, 1:18 PM IST

బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు  చేశారు. సీఎం కేసీఆర్ తెలంగాణ పాలనను గాలికొదిలేశారని విమర్శించారు. సంక్రాంతి తర్వాత కేసీఆర్ కనుసన్నల్లో కొత్త ప్రాంతీయ పార్టీ రాబోతుందని అన్నారు. తెలంగాణ  సీఎం కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌లు కలిసి డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు. తెలుగు రాష్ట్రాల మధ్య విభజన సమస్యలు పరిష్కారం కాకుండా ఇరువురు సీఎంలు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. విభజన సమస్యలపై కేంద్ర మీటింగ్‌కు.. ఏపీ వాళ్ళు హాజరైతే, తెలంగాణ వాళ్ళు వెళ్లడం లేదని, తెలంగాణ వాళ్ళు వెళ్తే.. ఏపీ వాళ్ళు వెళ్లట్లేదని మండిపడ్డారు. 

అవగాహనలో భాగంగానే కృష్ణా, గోదావరి మేనేజ్‌మెంట్ మీటింగ్‌లకు ఇరు రాష్ట్రాల సీఎంలు హాజరుకావటం లేదని ఆరోపించారు. అదే సమయంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీపై కూడా ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్ సంచలన కామెంట్స్ చేశారు. ఇంచార్జ్‌గా మాణిక్కం ఠాగూర్ వెళ్లినా... మాణిక్ రావ్ ఠాక్రే వచ్చినా కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ అవుతుందని అన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios