టీడీపీ ఎంపీలు ఎలాంటి షరతులు లేకుండా తమ పార్టీలో చేరానని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు అన్నారు. తమ పార్టీలో చేరినంత మాత్రాన వాళ్లు కేసుల నుంచి బయటపడతారనుకోవడం అవివేకమన్నారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెప్పారు.

శుక్రవారం మీడియా సమాశంలో మాట్లాడిన మురళీధర్ రావు మాట్లాడుతూ...నేషనల్ యోగ డే సందర్భంగా దేశ వ్యాప్తంగా మోడీ పిలుపునిచ్చిన మేరకు అందరు యోగ కార్యక్రమంలో పాల్గొన్నారని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో జరుగుతుందన్నారు.

గోదావరి జలాల విషయంలో మొదటి నుండి బీజేపీ ముందుందని..,ఉద్యమం చేసిందని..తెలంగాణ అభివృద్ధి కి,రైతాంగానికి చేసే ప్రయత్నాన్ని తాను స్వాగతిస్తున్నామని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ను  ముందునుండి నడిపించింది బీజేపీప్రభుత్వమేనన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కొన్ని విషయాలు చెప్పాలని డిమాాడ్ చేశారు.

పెట్టుబడులు, నిధులు ఎక్కడినుండి వచ్చాయో చెప్పాలన్నారు. ప్రజలకు ఈ విషయాలు చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పారు.ఎన్ని ఎకరాలకు నీళ్లు అందిస్తారో ఇంకా స్పష్టత లేదన్నారు.అన్ని అవసరాలకు ఉపయోగించిన తర్వాత మిగిలిన 160 టీఎంసీలు మిగిలితే మొత్తం16 లక్షల ఎకరాలకు అందుతుందని చెప్పారు. ప్రాజెక్టుకు కేంద్రం నిధుల ఇవ్వలేదు అనడంలో వాస్తవం లేదన్నారు.

అనుమతులు, నిధులు వేగంగా కేంద్రము అందించిందని చెప్పారు..గత కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని అనుమతులు, నిధులు ఇచ్చారో చెప్పాలన్నారు. ఇలాంటి దుష్ప్రచారం వల్ల టీఆర్ఎస్ కే నష్టం..నీటి వాడకం విషయంలో మేము స్వాగతిస్తున్నమని..,అనుమతులు ఇస్తున్నామని చెప్పారు.

తెలంగాణ దేశంలో భాగమే తప్ప, పాకిస్థాన్ లో తెలంగాణ లేదు..అన్ని అంశాల్లో తెలంగాణ ముందుందని చెప్పారు..జాతీయ రహదారుల విషయంలో ఈ నాలుగేళ్లలో జెట్ స్పీడ్ లో చేసిందితెలంగాణ లో రాబోయే రోజుల్లో రాజకీయ సమీకరణాలు చాలా వేగంగా మారబోతున్నాయి అని చెప్పారు.ప్రతిపక్షం గా బీజేపీ ఉండబోతోందన్నారు.