Asianet News TeluguAsianet News Telugu

నిజం నిప్పులాంటిది చెల్లెమ్మా - నిన్ను ఎవ్వరు కాపాడలేరు : కవితకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కౌంటర్

తనపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఆమెను చెల్లెమ్మ అని సంబోధిస్తూ.. నిన్ను లిక్కర్ స్కాం కేసు నుంచి ఎవ్వరూ కాపాడలేరని ఆయన కవితను హెచ్చరించారు. 

bjp leader komatireddy raj gopal reddy counter to brs mlc kalvakuntla kavitha
Author
First Published Dec 21, 2022, 5:37 PM IST

తనపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. నిజం చెప్పులాంటిది చెల్లెమ్మా..  నువ్వు లిక్కర్ స్కాంలో వున్నది నిజమని ఆయన వ్యాఖ్యానించారు. నిన్ను మీ అన్న, మీ నాయనా ఎవరూ కాపాడలేరని.. కోల్ బ్లాక్ టెండర్ల విషయంలో తనపై విష ప్రచారం చేశారని కోమటిరెడ్డి ఆరోపించారు. అవినీతిమయమైన కల్వకుంట్ల కుటుంబం జైలుకెళ్లడం ఖాయమని రాజగోపాల్ రెడ్డి జోస్యం చెప్పారు. మునుగోడు ఉపఎన్నిక సమయంలో తనను రాజకీయంగా ఎదుర్కోలేక టీఆర్ఎస్ నాయకులు తనపై ఆరోపణలు చేశారని ఆయన ధ్వజమెత్తారు. 

అంతకుముందు .. ఢిల్లీ లిక్కర్ కేసులో నిందితుడిగా ఉన్న సమీర్‌ మహేంద్రుపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తాజాగా దాఖలు చేసిన చార్జ్‌షీట్‌లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఆయన కుమారుడు మాగుంట రాఘవ్‌‌ రెడ్డి, అరబిందో ఫార్మా డైరెక్టర్‌ శరత్‌ చంద్రారెడ్డి‌లతో పాటు పలువురి పేర్లను ప్రస్తావించింది. అయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవిత పేరును మరోసారి ఈడీ ప్రస్తావించడం‌పై వార్తపత్రికల్లో వచ్చిన కథనాన్ని షేర్ చేసిన.. మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆమెపై విమర్శలు చేశారు. 

కవితను లిక్కర్ క్వీన్ అని రాజగోపాల్ రెడ్డి విమర్శించారు. ‘‘చార్జిషీట్‌లో లిక్కర్ క్వీన్స్ పేరు 28 సార్లు ప్రస్తావించబడింది’’ అని రాజగోపాల్ రెడ్డి ట్వీట్ చేశారు. అయితే ఈ ట్వీట్‌పై స్పందించిన కవిత.. రాజగోపాల్ రెడ్డికి కౌంటర్ ఇచ్చారు. రాజగోపాల్ అన్న తొందరపడి మాట జారకు అని పేర్కొన్న కవిత.. 28 వేల సార్లు తన పేరు చెప్పించినా అబద్దం నిజం కాదని పేర్కొన్నారు. 

‘‘రాజగోపాల్ అన్న .. తొందరపడకు , మాట జారకు !!. " 28 సార్లు " నా పేరు చెప్పించినా.. " 28 వేల సార్లు " నా పేరు చెప్పించినా.. అబద్ధం నిజం కాదు..’’ అని రాజగోపాల్ రెడ్డికి కల్వకుంట్ల కవిత కౌంటర్ ఇచ్చారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios