Asianet News TeluguAsianet News Telugu

ఐటీ దాడులకు మోదీకి సంబంధం లేదు:కిషన్ రెడ్డి

కాంగ్రెస్‌ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి ఇళ్లపై ఐటీ శాఖ అధికారుల దాడుల వెనుక ప్రధాని నరేంద్రమోదీ కుట్ర ఉందన్న కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలను బీజేపీ నేత కిషన్ రెడ్డి ఖండించారు. రేవంత్ ఇళ్లపై ఐటీ శాఖ దాడులకు ప్రధాని నరేంద్ర మోదీకి సంబంధం లేదని తెలిపారు.

bjp leader kishan reddy comments on it rides in revanthreddy house
Author
Hyderabad, First Published Sep 27, 2018, 8:53 PM IST

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి ఇళ్లపై ఐటీ శాఖ అధికారుల దాడుల వెనుక ప్రధాని నరేంద్రమోదీ కుట్ర ఉందన్న కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలను బీజేపీ నేత కిషన్ రెడ్డి ఖండించారు. రేవంత్ ఇళ్లపై ఐటీ శాఖ దాడులకు ప్రధాని నరేంద్ర మోదీకి సంబంధం లేదని తెలిపారు. రేవంత్‌రెడ్డి ఇంటికి వెళ్లి దాడి చేయాలని ఐటీ అధికారులకు ప్రధాని మోదీ చెప్పే అంత ఖర్మ బీజేపీకి పట్టలేదన్నారు.  

కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులకు ఐటీ దాడులు ఎలా జరుగుతాయో తెలియదా అని ప్రశ్నించారు. ఇటీవలే ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి నివాసం, కార్యాలయాలపై కూడా ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారని గుర్తుచేశారు. ఆరోపణలు వచ్చిన వారిపై ఆదాయపన్ను శాఖ అధికారులు దర్యాప్తు చేస్తారని వివరించారు. 

మరోవైపు  ఒవైసీ ఆసుపత్రికి భూ కేటాయింపుపై హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్లు కిషన్ రెడ్డి తెలిపారు. హైకోర్టు స్టే జారీ చేసిన నేపథ్యంలో ప్రభుత్వం జీవోను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఒవైసీ కళాశాలలో పేద ముస్లిం విద్యార్థులకు డొనేషన్‌ లేకుండా ఒక్క సీటు అయినా ఇచ్చారా అని కిషన్ రెడ్డి నిలదీశారు.

Follow Us:
Download App:
  • android
  • ios