Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణ ఉద్యమకారులకు కేసీఆర్ ఫోన్లు:బీజేపీకి దాసోజు గుడ్ బై, అదే బాటలో మరికొందరు నేతలు

మునుగోడు ఉప  ఎన్నికను పురస్కరించుకొని తెలంగాణ ఉద్యమకారులకు కేసీఆర్  పోన్లు  చేశారు. దాసోజు శ్రవణ్, మాజీ  శాసనమండలి  చైర్మెన్  స్వామిగౌడ్ ,విఠల్ లకు కేసీఆర్  ఫోన్ చేశారు. దాసోజు శ్రవణ్  బీజేపీకి రాజీనామా  చేశారు.

BJP Leader  Dasoju Sravnan Resigns To BJP
Author
First Published Oct 21, 2022, 1:04 PM IST

హైదరాబాద్:హైదరాబాద్:మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో  తెలంగాణ ఉద్యమకారులకు టీఆర్ఎస్  చీఫ్ కేసీఆర్  ఫోన్లు చేస్తున్నారు. దాసోజు శ్రవణ్  కుమార్, విఠల్ గౌడ్ ,మాజీ శాసనమండలి  చైర్మెన్ స్వామి గౌడ్ లకు కూడ ఫోన్  చేసినట్టుగా ప్రచారం  సాగుతుంది.దాసోజు శ్రవణ్ కుమార్  బీజేపీక  రాజీనామా  చేశాడు. ఇవాళ  సాయంత్రం టీఆర్ఎస్ లో  చేరనున్నారు. మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ ఉద్యమంలో తనతో కలిసి  పనిచేసి  ప్రస్తుతం టీఆర్ఎస్ కు  దూరంగా  ఉన్నవారికి కేసీఆర్  ఫోన్లు  చేశారని  సమాచారం.ఇవాళ ఉదయమే దాసోజు శ్రవణ్  బీజేపీకి రాజీనామా  చేశారు.తన రాజీనామా  లేఖను బీజేపీ  తెలంగాణ  రాష్ట్ర అధ్యక్షుడు బండి  సంజయ్ కు పంపారు.

BJP Leader  Dasoju Sravnan Resigns To BJP

మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికల సమయంలోనే  మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ టీఆర్ఎస్ కు గుడ్ బై  చెప్పి  బీజేపీలో  చేరారు. మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో మెజారిటీ ఓటర్లు బీసీలే. దీంతో బీసీ  ఓటర్లు చేజారకుండా ఉండేందుకు  ప్రధాన  పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. బూర నర్సయ్యగౌడ్  బీజేపీలో  చేరడంతో టీఆర్ఎస్ ప్రతివ్యూహలకు పదును పెట్టింది. కాంగ్రెస్ లో  ఉన్న చండూరు ఎంపీపీ పల్లె రవికుమార్ గౌడ్ దంపతులను టీఆర్ఎస్  చేర్చుకున్నారు. బీజేపీలో  ఉన్న ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద  బిక్షమయ్య గౌడ్  నిన్ననే టీఆర్ఎస్ లో చేరారు. బీసీ సామాజిక వర్గానికి   చెందిన  శ్రవణ్ కుమార్  ఇవాళ  బీజేపీకి  రాజీనామా  చేశారు. ఇవాళ  సాయంత్రం ఆయన టీఆర్ఎస్ లో  చేరనున్నారు.  మరో వైపు  తెలంగాణ శాసనమండలి చైర్మెన్ స్వామిగౌడ్ ,టీఎస్ పీఎస్ సీ సభ్యుడు విఠల్  గౌడ్ లకు కూడా  కేసీఆర్  ఫోన్లు చేసి టీఆర్ఎస్  లో చేరాలని  ఆహ్వానించారని  సమాచారం. 

టీఆర్ఎస్ లో  చేరే  విషయమై  తప్పుడు  ప్రచారం

తాను టీఆర్ఎస్ లో చేరుతున్నానని తప్పుడు ప్రచారం సాగుతుందని  టీఎఎస్ పీఎస్ సీ  మాజీ సభ్యుడు విఠల్ ప్రకటించారు. తాను బీజేపీని వీడి టీఆర్ఎస్ లో చేరుతున్నానని తనను చాలా మంది  ఫోన్లు చేసి అడుగుతున్నారన్నారు. తప్పుడు వార్తలను ప్రచారం చేయవద్దని ఆయన  మీడియాను కోరారు. నైతిక విలువలకు కట్టుబడి  తాను బీజేపీలో  చేరినట్టుగా   చెప్పారు.తనను ఎవరూ కొనుగోలు  చేయరని చెప్పారు. అంేకాదు  తననుఎవరూ కూడ ప్రభావితం  చేయలేరని  ఆయన  తేల్చి చెప్పారు. తన చివరి శ్వాస వరకు బీజేపీలోనే ఉంటానని విఠల్  గౌడ్ స్పష్టం  చేశారు.ఈ  ప్రకటనతో  విఠల్ గౌడ్ బీజేపీలోనే కొనసాగుతాడని తేలిపోయింది. మరో వైపు స్వామిగౌడ్ టీఆర్ఎస్ లో  చేరుతారనే  ప్రచారంపై ఆయన నుండి స్పష్టత రావాల్సి ఉంది.రెండు మాసాల క్రితమే కాంగ్రెస్ నుండి బీజేపీలో  చేరిన  దాసోజు శ్రవణ్ మళ్లీ టీఆర్ఎస్ లో చేరనున్నారు. ఇవాళ  సాయంత్రం కేటీఆర్  సమక్షంలో  శ్రవణ్ టీఆర్ఎస్ లో  చేరుతారని సమాచారం.

also read:మునుగోడు ఉప ఎన్నికలు.. 289లో 104 సెన్సిటివ్ పోలింగ్ బూత్ లు.. వివరాలు వెల్లడించిన ఎన్నికల సంఘం

మునుగోడు ఉప ఎన్నికల్లో విజయం సాధించడం కోసం ప్రధాన పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి.మునుగోడులో బీజేపీ అభ్యర్ధిగా  కోమటిరెడ్డి రాజగోపాల్  రెడ్డి,టీఆర్ఎస్ అభ్యర్ధిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్ధిగా  పాల్వాయి స్రవంతి బరిలో  నిలిచిన విషయం తెలిసిందే.

Follow Us:
Download App:
  • android
  • ios