Asianet News TeluguAsianet News Telugu

నీవెంత నీ బతుకెంత: కార్యకర్తను దూషించిన మాజీ మంత్రి బాబు మోహన్

తనకు ఫోన్  చేసిన  వెంకటరమణ  అనే కార్యకర్తను మాజీ మంత్రి  బాబుమోహన్   తిట్ల దండకం  అందుకున్నారు.  ఈ ఆడియో సంభాషణ  సోషల్ మీడియాలో  వైరల్ గా మారింది. 

BJP Leader Babu Mohan Controversial Comments on BJP Worker Venkataramana
Author
First Published Feb 7, 2023, 10:24 AM IST


హైదరాబాద్: తనకు  ఫోన్  చేసిన    వెంకటరమణ అనే  కార్యకర్తను మాజీ మంత్రి  బీజేపీ నేత  బాబు మోహన్ దూషించారు. ఈ ఆడియో సంభాషణ సోషల్ మీడియాలో  వైరల్ గా మారింది.

జోగిపేటకు  చెందిన   వెంకటరమణ అనే కార్యకర్త    బాబు మోహన్  కు  ఫోన్  చేసిన సమయంలో  ఈ ఘటన చోటు  చేసుకుంది.  తనకు  మరోసారి  ఫోన్  చేయవద్దని   బాబు మోహన్  వెంకటరమణకు వార్నింగ్  ఇచ్చారు.  మళ్లీ ఫోన్  చేస్తే   జోగిపేటలో  చెప్పుతో కొడతానని  బాబు మోహన్  అన్నట్టుగా  ఈ ఆడియో సంభాషణలో  ఉంది.  తాను కావాలో  నీవు కావాలో  పార్టీలో  తేల్చుకుంటానని కూడ  బాబు మోహన్  చెప్పారు. 

తాను ప్రపంచస్థాయి నాయకుడిగా   బాబు మోహన్  వెంకటరమణతో వ్యాఖ్యానించినట్టుగా  ఉంది . రెండు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ కోసం  పనిచేయాలని  తనను అమిత్ షా పార్టీలో  చేర్చుకున్నారని  బాబు మోహన్  వెంకటరమణతో  చెప్పినట్టుగా  ఈ ఆడియో సంభాషణ ఉందని ప్రముఖ  తెలుగు న్యూస్ చానెల్  ఎన్టీవీ  కథనం  ప్రసారం  చేసింది.   నీవెంత  నీ బతుకెంత  అని కూడా  బీజేపీ  కార్యకర్తపై  బాబుమోహన్ మండిపడ్డారు. అవసరమైతే  తాను బీజేపీకి రాజీనామా చేస్తానని  కూడా  బాబుమోహన్ వ్యాఖ్యలు  చేశారని  ఆ ఆడియో సంభాషణలో  ఉందని  ఈ కథనం  తెలిపింది.  

అయితే  వెంకటరమణతో  మాట్లాడినట్టుగా  ఉన్న ఆడియో సంభాషణ  బాబు మోహన్ మాట్లాడిందేనా ,  ఆయన మాదిరిగా ఎవరైనా మాట్లాడారా అనే విషయం  ఫోరెన్సిక్ నిపుణులు తేలుస్తారు. ఈ  ఆడియో సంభాషణపై  పార్టీ నాయకత్వం తో  పాటు  బాబు మోహన్ ఎలా స్పందిస్తారో  చూడాలి.

Follow Us:
Download App:
  • android
  • ios