హైదరాబాద్‌: భారతీయ జనతాపార్టీపై ఎంఐఎం అధినేత హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినట్లు తనకు కూడా ఓ గోవును ఇవ్వాలని కోరారు. బీజేపీ అధికారంలోకి వస్తే రాష్ట్ర వ్యాప్తంగా లక్ష గోవులను పంచుతామని ఆపార్టీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్‌ ఎన్‌బీఎస్‌ఎస్‌ ప్రసాద్‌ ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు.

 బీజేపీ ప్రకటించిన విధంగా తనకు కూడా ఓ గోవును ఇవ్వగలరా అని ప్రశ్నించారు. వారు నాకు గోవును ఇస్తే దానిని పవిత్రంగా చూసుకుంటాను. వాళ్లు నాకు ఇవ్వగలరా అని ఓవైసీ నిలదీశారు. ఇకపోతే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో గో మంత్రిత్వ శాఖలను ఏర్పాటు చేస్తామని ఆ రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే ప్రకటించాయి. రాజస్తాన్‌లో అయితే సీఎం వసుంధర రాజే గోవుల రక్షణకు ఏటా వందలకోట్లు కేటాయించి ప్రత్యేక రక్షణ కూడా తీసుకుంటున్నారు.