Asianet News TeluguAsianet News Telugu

ఎల్లుండి బీజేపీ తొలి జాబితా: తెలంగాణలో అభ్యర్థులు వీరే

తెలంగాణలో పోటీ చేసే  అభ్యర్థుల జాబితాను బీజేపీ  పార్లమెంటరీ బోర్డు  అక్టోబర్ 21 వ తేదీన ప్రకటించే అవకాశం ఉంది. 

bjp candidates first list likely to announce on oct 21
Author
Hyderabad, First Published Oct 19, 2018, 1:20 PM IST


హైదరాబాద్: తెలంగాణలో పోటీ చేసే  అభ్యర్థుల జాబితాను బీజేపీ  పార్లమెంటరీ బోర్డు  అక్టోబర్ 21 వ తేదీన ప్రకటించే అవకాశం ఉంది.  25 మందితో తొలి జాబితాను  ఆ పార్టీ ఎన్నికల కమిటీ సిద్దం చేసినట్టు సమాచారం. ఈ జాబితాతో  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు  శుక్రవారం నాడు ఢిల్లీకి వెళ్లనున్నారు.

రెండు రోజుల నుండి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను  బీజేపీ సిద్దం చేస్తోంది. సుమారు 25 నుండి 30 మందితో  తొలి జాబితా ఉంటుందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.

అక్టోబర్ 20వ తేదీన  బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం ఉంది.ఈ సమావేశంలో అభ్యర్థుల జాబితాకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది.బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిటీ రెండు రోజులుగా కసరత్తు చేసి సుమారు 25 మంది అభ్యర్థుల పేర్లను దాదాపుగా ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది.

ఎన్నికల కమిటీ  ఫైనల్ చేసిన అభ్యర్థుల జాబితాతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్  లక్ష్మణ్ శుక్రవారం నాడు ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు ఉదయం ఢిల్లీలో జరిగే బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఈ లిస్టును ఇవ్వనున్నారు. ఈ లిస్టుకు బీజేపీ పార్లమెంటరీ పార్టీ ఆమోదం తెలిపే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.

బీజేపీ తొలి జాబితాలో అభ్యర్థులు వీరే

ఖైరతాబాద్ - చింతల రామచంద్రారెడ్డి
కల్వకుర్తి   - ఆర్. ఆచారి
దుబ్బాక   - రఘునందన్ రావు
ముషీరాబాద్- డాక్టర్ లక్ష్మణ్
అంబర్‌పేట- కిషన్ రెడ్డి
సికింద్రాబాద్- సతీష్
వనపర్తి  - అమరేందర్ రెడ్డి
పెద్దపల్లి - రామకృష్ణారెడ్డి

ఎల్బీనగర్ -పేరాల చంద్రశేఖర్ రావు
సూర్యాపేట  -సంకినేని వెంకటేశ్వరరావు
కరీంనగర్   -బండి సంజయ్
భూపాలపల్లి - కీర్తిరెడ్డి
ఉప్పల్  -ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ రావు
మునుగోడు  -మనోహర్ రెడ్డి
మేడ్చల్ - మోహన్ రెడ్డి
ఆదిలాబాద్  -పాయల శంకర్
ముథోల్ - రమాదేవి
నారాయణపేట  -రతంగ్ పాండురెడ్డి
 

 

Follow Us:
Download App:
  • android
  • ios