గజ్వేల్ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆకుల విజయకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఎన్నికల ప్రచారానికి వెళ్తుండగా.. ఆమె ప్రయాణిస్తున్న కారు శనివారం  ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఆకుల విజయం తృటిలో ప్రాణాపాయ స్థితి నుంచి తప్పించుకున్నారు. కాగా.. కారు మాత్రం పూర్తిస్తాయిలో ధ్వంసమైంది.

గజ్వేల్ లో టీఆర్ఎస్ నుంచి కేసీఆర్ పోటీచేస్తుండగా.. కాంగ్రెస్ నుంచి వంటేరు ప్రతాప్ రెడ్డి ఎన్నికల బరిలో నిలిచారు. వీరిద్దరికీ పోటీగా బీజేపీ నుంచి ఆకుల విజయ పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఆకుల విజయ.. సిరిసిల్ల నియోజకవర్గం నుంచి కేటీఆర్ కి పోటీగా.. బీజేపీ అభ్యర్థిగా పోటీలో నిలిచి.. ఓటమి చవిచూశారు.