హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల కోసం బీజేపీ పకడ్బందీ వ్యూహంతో ముందుకు వెళ్తోంది. ఆయా అసెంబ్లీ నియోజకవర్గాలకు బీజేపీ ఇంచార్జీలను నియమించింది.

జీహెచ్ఎంసీ ఎన్నికలను బీజేపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొంది. ఈ ఎన్నికల్లో జీహెచ్ఎంసీపై బీజేపీ జెండాను ఎగురవేయాలని కమలదళం ప్రయత్నిస్తోంది.
ఈ క్రమంలో భాగంగానే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఇంచార్జీలను నియమించింది బీజేపీ.

జీహెచ్ఎంసీ ఎన్నికలను పురస్కరించుకొని ఇతర పార్టీల్లోని అసంతృప్తులతో పాటు మాజీ ఎమ్మెల్యేలకు బీజేపీ గాలం వేస్తోంది. కొందరు ఇవాళ బీజేపీ తీర్ధంపుచ్చుకోనున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ను ఓడించాలనే గట్టి పట్టుదలతో బీజేపీ ఉంది. ఈ మేరకు క్షేత్రస్థాయిలో ఆ పార్టీ వ్యూహారచన చేస్తోంది. ఇందులో భాగంగానే ఆయా అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇంచార్జీలను బీజేపీ నియమించినట్టుగా ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రకటించారు.

జీహెచ్ఎంసీ పరిధిలో అసెంబ్లీ నియోజకవర్గాల ఇంచార్జీలు


మహేశ్వరం- యెన్నం శ్రీనివాస్ రెడ్డి
రాజేంద్రనగర్-వన్నాల శ్రీరాములు
శేరిలింగంపల్లి- ధర్మపురి అరవింద్
ఉప్పల్-ధర్మారావు
మల్కాజిగిరి- రఘునందన్ రావు
కూకట్‌పల్లి-పెద్దిరెడ్డి
పటాన్ చెరు- పొంగులేటి సుధాకర్ రెడ్డి
అంబర్‌పేట-రేవూరి ప్రకాష్ రెడ్డి
ముషీరాబాద్-జితేందర్ రెడ్డి
సికింద్రాబాద్-విజయరామారావు
కంటోన్మెంట్-శశిధర్ రెడ్డి
సనత్‌నగర్-మోత్కుపల్లి నర్సింహ్ములు
జూబ్లీహిల్స్-ఎర్రశేఖర్
చార్మినార్-లింగయ్య
నాంపల్లి-సోయంబాపూరావు
గోషామహల్- లక్ష్మీనారాయణ
కార్వాన్-బొడిగే శోభ
మలక్‌పేట-విజయపాల్ రెడ్డి
యాకత్‌పురా-రామకృష్ణారెడ్డి
చాంద్రాయణగుట్ట-రవీంద్రనాయక్
బహదూర్‌పుర-సుద్దాల దేవయ్య
ఖైరతాబాద్-మృత్యుంజయం