గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో బీజేపీ దూకుడుగా వెళ్తోంది. ఇప్పటికే బుధవారం 21 మందితో తొలి జాబితాను విడుదల చేసిన భారతీయ జనతా పార్టీ.. తాజాగా 19 మందితో రెండో జాబితాను ప్రకటించింది.

కాగా, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేన పార్టీతో పొత్తు ఉండదని తెలంగాణ రాష్ట్ర బీజేపి అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి తేల్చిచెప్పారు. అసలు జనసేన పార్టీతో పొత్తు అంశం బీజేపీలో చర్చకే రాలేదని.. అలాగే పొత్తులపై జనసేన నుంచి కూడా ఎలాంటి ప్రతిపాదనలు రాలేదని బండి సంజయ్ స్పష్టంచేశారు.

బీజేపీతో జనసేన కలిసి పనిచేయడం అనేది ఏపీ వరకే పరిమితం అవుతుందని.. అది తెలంగాణకు వర్తించదని ఆయన ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే.

బీజేపీ అభ్యర్ధులు:

గన్సీబజార్ - రేణు సోనీ
జియా గూడ - బోయిని దర్శన్
మంగళ్ హట్ - శశికళ
దత్తాత్రేయ నగర్ - ధర్మేంద్ర సింగ్
గోల్కొండ - శకుంతల
గుడిమల్కాపూర్ - కరుణాకర్ 
జాంబాగ్ -  రూప్ ధారక్
నాగోల్ - అరుణా యాదవ్
మన్సూరాబాద్ - కొప్పుల నర్సింహ రెడ్డి
హయత్ నగర్ -  నవజీవన్ రెడ్డి
బీఎన్ రెడ్డి నగర్ - లచ్చిరెడ్డి
చంపాపేట్ - మధుసూదన్ రెడ్డి
లింగోజిగూడ - ఆకుల రమేశ్ గౌడ్
కొత్తపేట్ - పవన్  కుమార్
చైతన్యపురి - నర్సింహగుప్త
సరూర్ నగర్ - ఆకుల శ్రీవాణి
ఆర్కే పురం - రాధా ధీరజ్ రెడ్డి
మైలార్‌దేవ్ పల్లి - శ్రీనివాస్ రెడ్డి
జంగంపేట్ - మహేందర్