Asianet News TeluguAsianet News Telugu

ఆబిడ్స్ పోలీస్ స్టేషన్‌లో తాజా మాజీ ఎమ్మెల్యే...

తెలంగాణలో ముందస్తు ఎన్నికల కోసం అన్ని పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. అయితే ఇలాంటి సమయంలో ప్రతిపక్ష పార్టీల నాయకులను పోలీస్ కేసులు వెంటాడుతున్నాయి. ఇప్పటికే సంగారెడ్డి కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అరెస్టై జైల్లో ఉండగా, రేవంత్ రెడ్డి, గండ్రవెంకట రమణారెడ్డి, కూన శ్రీశైలం గౌడ్ లపై పోలీసులు కేసులు నమోదు చేశారు. అలాగే సంచలన కామెంట్స్ తో ఎప్పుడూ వార్తల్లో ఉండే గోషామహల్ బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ పై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.  అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించాడని పోలీసులు రాజాసింగ్ పై కేసు నమోదైంది. ఈ కేసులో విచారణ సందర్భంగా ఇవాళ రాజాసింగ్ ఆబిడ్స్ పోలీస్టేషన్లో హాజరయ్యారు. 

BJL MLA Raja Singh Reacts On Police Legal Notice
Author
Abids, First Published Sep 17, 2018, 4:26 PM IST

తెలంగాణలో ముందస్తు ఎన్నికలకోసం అన్ని పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. అయితే ఇలాంటి సమయంలో ప్రతిపక్ష పార్టీల నాయకులను పోలీస్ కేసులు వెంటాడుతున్నాయి. ఇప్పటికే సంగారెడ్డి కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అరెస్టై జైల్లో ఉండగా, రేవంత్ రెడ్డి, గండ్రవెంకట రమణారెడ్డి, కూన శ్రీశైలం గౌడ్ లపై పోలీసులు కేసులు నమోదు చేశారు. అలాగే సంచలన కామెంట్స్ తో ఎప్పుడూ వార్తల్లో ఉండే గోషామహల్ బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ పై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.  అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించాడని పోలీసులు రాజాసింగ్ పై కేసు నమోదైంది. ఈ కేసులో విచారణ సందర్భంగా ఇవాళ రాజాసింగ్ ఆబిడ్స్ పోలీస్టేషన్లో హాజరయ్యారు. 

ఈ ఏడాది ఆగస్టు 15వ తేదీన హైదరాబాద్ లో రాజాసింగ్ ఆద్వర్యంలో తిరంగ యాత్ర పేరుతో భారీ ర్యాలీ జరిగింది. అయితే ఈ ర్యాలీని ఎలాంటి అనుమతులు తీసుకోకుండా నిర్వహించారంటూ రాజాసింగ్ పై ఇటీవలే పలు కేసులు నమోదయ్యాయి. ఈ కేసు విచారణలో భాగంగా ఇవాళ రాజాసింగ్ ఆబిడ్స్ పోలీసుల ముందు హాజరయ్యారు.  న్యాయవాదులతో కలిసి పోలీస్టేషన్ కు వచ్చిన రాజాసింగ్ పోలీసుల ప్రశ్నలకు లిఖితపూర్వకంగా సమాధానాలు చెప్పినట్లు సమాచారం.

విచారణ అనంతరం బైటకు వచ్చిన రాజాసింగ్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణలోప్రస్తుతం రజాకార్ల పాలన కొనసాగుతోందని టీఆర్ఎస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. అధికార పార్టీ కారు స్టీరింగ్ ఎంఐఎం చేతిలో ఉందని ఎద్దేవా చేశారు. ఎంఐఎం పార్టీ సూచనల మేరకే తనపై కేసు నమోదయ్యిందని రాజాసింగ్ ఆరోపించారు. తనను ఎంత టార్గెట్ చేసినా మళ్లీ గోషామహల్ నుండే బిజెపి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు .  

సంబంధిత వార్తలు

మరో మాజీ ఎమ్మెల్యేకు నోటీసులు జారీ చేసిన పోలీసులు (వీడియో)

 


 

Follow Us:
Download App:
  • android
  • ios