బీఆర్ఎస్‌లోకి బిత్తిరి సత్తి.. ఆహ్వానించిన మంత్రి హరీశ్ రావు

బిత్తిరి సత్తి బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. మంత్రి హరీశ్ రావు ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ముదిరాజ్ నేతలకు బీఆర్ఎస్ ప్రాధాన్యత ఇవ్వలేదన్న వాదనల నేపథ్యంలో అదే వర్గానికి చెందిన సత్తిని పార్టీలోకి ఆహ్వానించడం గమనార్హం.
 

bithiri satthi joins brs party, minister harish rao welcomes him kms

హైదరాబాద్: టీవీ చానెల్‌లో బిత్తిరి సత్తి పేరుతో ఫేమస్ అయిన చేవెళ్ల రవి కుమార్ బీఆర్ఎస్‌లో చేరారు. తెలంగాణ భవన్‌ వేదికగా మంత్రి హరీశ్ రావు కండువా కప్పి బిత్తిరి సత్తిని ఆహ్వానించాు. టీపీసీసీ మాజీ సెక్రెటరీ సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి, ఏఎస్ రావు నగర్ కార్పొరేటర్ సింగిరెడ్డి శిరీష్ సహా పలువురు కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. వీరందరికీ మంత్రి హరీశ్ రావు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ కార్యక్రమంలో మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీపై విమర్శలు సంధించారు. రాష్ట్రంలో బలమైన నాయకత్వం ఉండాలా? బలహీన నాయకత్వం ఉండాలా? అని అడిగారు. బీఆర్ఎస్ నుంచి బలమైన నేత కేసీఆర్ ఉన్నారని, ఆయనకు సమవుజ్జీగా ఎదుటి వైపు ఎవరు ఉన్నారని ప్రశ్నించారు.

Also Read: కాంగ్రెస్ ప్రకటించని ఆ 19 స్థానాల మతలబేంటీ?

ఇటీవలే హైదరాబాద్‌లో ముదిరాజ్‌ల సభ పెట్టినప్పుడు బిత్తిరి సత్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలు ముదిరాజ్‌లను పట్టించుకోవడం లేదని ఆక్రోశించారు. బీఆర్ఎస్ కూడా విడుదల చేసిన అభ్యర్థుల జాబితాలో ఒక్క ముదిరాజ్ నేతకూ అందులో అవకాశం ఇవ్వలేదు. ఈ నేపథ్యంలోనే బిత్తిరి సత్తిని పార్టీలోకి తీసుకున్నట్టు తెలుస్తున్నది. ముదిరాజ్ వర్గం మద్దతు కోసమే ఆయనను పార్టీలోకి తీసుకున్నారా? అనే చర్చ జరుగుతున్నది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios