పేదోళ్ల గురించి ఆలోచించే ఏకైక నాయకుడు కేసీఆర్.. బిత్తిరి సత్తి

తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై బిత్తిరి సత్తి అలియాస్ రవికుమార్ ప్రశంసలు కురిపించారు. 

Bithiri sathi parise brs chief KCR ksm

తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై బిత్తిరి సత్తి అలియాస్ రవికుమార్ ప్రశంసలు కురిపించారు. పేదవారి గురించి ఆలోచించే ఏకైక నాయకుడు కేసీఆర్ అన్నారు. ఈ మేరకు బిత్తిరి సత్తి మాట్లాడిన వీడియోను బీఆర్ఎస్ పార్టీ ఎక్స్(ట్విట్టర్)లో షేర్ చేసింది. ఎన్నికల సమయంలో నాయకులు పార్టీలు మారుతున్నారని.. వారి వద్ద వేలకోట్ల రూపాయలు ఉండటంతో ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి, ఆ పార్టీ నుంచి ఆ పార్టీకి మారుతున్నారని అన్నారు. కానీ కేసీఆర్ మాత్రం వేలకోట్ల ఆదాయం ఉన్నవారి గురించి ఆలోచించడం లేదని.. అయిదువేళ్లు నోట్లోకి వెళ్తున్నాయా? లేదా? అనే పేదోళ్ల గురించి మాత్రమే ఆలోచిస్తున్నారని చెప్పారు. 

ఇక, బిత్తిరి సత్తి అసలు పేరు రవికుమార్ ముదిరాజ్. కొద్ది మందికి మాత్రమే అసలు పేరు తెలుసు. జర్నలిస్ట్ అయిన ఆయన.. బిత్తిరి సత్తి పేరుతో ఫేమస్ అయ్యారు. ఆ తర్వాత పలు టీవీ షోలు సందడి చేయడంతో పాటు, కొన్ని సినిమాల్లో కూడా బిత్తిరి సత్తి నటించారు. అయితే ఇటీవల బిత్తిరి సత్తి మంత్రి హరీశ్ రావు సమక్షంలో బీఆర్ఎస్‌కు మద్దతు తెలుపుతున్నట్టుగా చెప్పారు. గత ఎన్నికల సమయంలో కూడా తాను బీఆర్ఎస్ కోసం పాట పాడానని చెప్పారు. కేసీఆర్‌ మీద పాట పాడటమే కాకుండా.. మరోసారి బీఆర్ఎస్‌ను గెలిపించాలని ప్రజలను కోరారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios