Asianet News TeluguAsianet News Telugu

వెండితెరపై కేసీఆర్ జీవితం, 'ఉద్యమ సింహం' గా కనిపించనున్న నాజర్

నవంబర్ 29 రిలీజ్ కు సన్నాహాలు...

Biopic on Telangana cm kcr

కేసీఆర్...తెలంగాణ ప్రజలకు సుపరిచితమైన పేరు. ఆయన తెలంగాణ యాసకు, చలోక్తులకు  రాష్ట్రంలో చాలామంది ప్యాన్స్  ఉన్నారు. ఇక ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలో  ఆయన తెలంగాణ కోసం ప్రాణాలకు తెగించి పోరాడారు. ఆ తర్వాత ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా బాద్యతలు చేపట్టి ప్రజా సంక్షేమం కోసం అలుపెరగకుండా పోరాడుతున్నారు. ఇలా ఆయన జీవితంలో ఓ సినిమా కథకి తగినన్ని మలుపులున్నాయి. ఈ విషయాన్ని గమనించారో ఏమో గాని ఆయన జీవితాన్ని వెండితెరపై ఆవిష్కరించడానికి టాలీవుడ్ సిద్దమవుతోంది.

ప్రస్తుతం అటు బాలీవుడ్ తో పాటు టాలీవుడ్‌ లోనూ బయోపిక్‌ల జమానా కొనసాగుతోంది. అయితే హిందీలో ముఖ్యంగా క్రీడాకారులపై బయోపిక్ లు రూపొందుతుండగా తెలుగులో మాత్రం ప్రముఖ రాజకీయ నాయకుల జీవితాలపై తెరకెక్కుతున్నాయి. ఇప్పటికే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్,రాజశేఖర్ రెడ్డి జీవితాలపై బయోపిక్ లు రూపొందుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ జాబితాలో తెలంగాణ సీఎం కేసీఆర్ బయోపిక్ చేరింది. 

తెలంగాణ రాష్ట్ర మొట్టమొదటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పై రూపొందుతున్న బయోపిక్‌ ఇవాళ ప్రారంభమైంది. ఈ  సినిమాలో కేసీఆర్‌ పాత్రలో విలక్షణ నటుడు నాజర్‌ నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని కల్వకుంట్ల నాగేశ్వర్‌రావు నిర్మిస్తుండగా, అల్లూరి కృష్ణంరాజు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ బయోపిక్ కు ‘ఉద్యమ సింహం’పేరును ఖరారు చేశారు.

కేసీఆర్ తెలంగాణ ఉద్యమంలో పోషించిన పాత్రను ఈ మూవీలో ప్రధానంగా చూపించనున్నట్లు ఈ సినిమా యూనిట్ తెలిపింది. ఈ సినిమాను కేసీఆర్‌ తెలంగాణ సాధన కోసం దీక్ష ప్రారంభించిన నవంబర్‌ 29 రోజే రిలీజ్ చేసేందుకు యూనిట్ సన్నాహాలు చేస్తోంది.   

 

 
 

Follow Us:
Download App:
  • android
  • ios