కూతురితో అక్రమ సంబంధాన్ని కలిగివున్న వ్యక్తిని చంపేందుకు ఓ తండ్రి బిహారీ సుపారీ గ్యాంగ్ ను రంగంలోకి దింపిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో వెలుగుచూసింది. 

వేములవాడ: తన కూతురితో అక్రమసంబంధం పెట్టుకున్ని వ్యక్తిని చంపేందుకు ఓ తండ్రి బిహారీ గ్యాంగ్ ను రంగంలోకి దింపాడు. అయితే పక్కా సమాచారంతో పోలీసులు బిహార్ నుండి హత్యచేయడానికి వచ్చిన ఇద్దరిని పట్టుకుని కుట్రను చేదించారు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుంది.

ఈ సుపారీ హత్యకుట్రకు సంబంధించిన వివరాలను సిరిసిల్ల ఎస్పీ రాహుల్ హెగ్డే వివరించారు. వేములవాడ తిప్పాపూర్ కు చెందిన నీలం శ్రీనివాస్ కూతురికి మనోజ్ కుమార్ అనే వ్యక్తితో అక్రమసంబంధం వుంది. పెళ్ళయినప్పటికి ఆమె ఈ సంబంధాన్ని కొనసాగిస్తుండటంతో భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నారు. దీంతో కూతురితో సంబంధాన్ని కలిగివున్న వ్యక్తిని హతమార్చేందుకు శ్రీనివాస్ కుట్రపన్నాడు. 

Video

తనకు తెలిసిన కుంటయ్యతో కలిసి బిహార్ కు చెందిన సుపారీ గ్యాంగ్ ను కలుసుకున్నాడు శ్రీనివాస్. బొమ్మడి రాజ్ కుమార్, లఖింద్ర సాహ్ని అనే ఇద్దరు బిహారీ వ్యక్తులతో ఐదు లక్షలు సుపారీ ఇచ్చి కూతురి ప్రియున్ని చంపడానికి ఒప్పందం కుదుర్చుకున్నాడు. దీంతో ఆయుధాలతో సిరిసిల్ల జిల్లాకు చేరుకున్నారు ఇద్దరు నిందితులు. 

అయితే ఇవాళ ఉదయం పోలీసులు వాహనాల తనిఖీ చేపతుండగా రాజ్ కుమార్, లిఖిందర్ సింగ్ ఆయుధాలతో పట్టుబడ్డారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించగా హత్య కుట్ర వెలుగుచూసింది. దీంతో శ్రీనివాస్, ముత్తయ్యను కూడా అదుపులోకి తీసుకున్నాట్లు పోలీసులు తెలిపారు. ఈ నలుగురిని రిమాండ్ కు తరలించిన ఎస్పీ రాహుల్ వెల్లడించారు. ఓ కారుతో పాటు బైక్, హత్యకోసం సమకూర్చుకున్న ఆయుధాలు, మొబైల్స్, ఐదువేల నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ వెల్లడించారు.

ఇదిలావుంటే హైదరాబాద్ లోని సరూర్ నగర్ లో పరువు హత్య జరిగింది. బుధవారం రాత్రి సరూర్ నగర్ చెరువుకట్టపై ప్రేమ పెళ్లి చేసుకున్న జంటపై కొందరు దుండగులు కత్తులతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో యువకుడు అక్కడికక్కడే మృతిచెందగా యువతి తీవ్రంగా గాయపడింది. కులాంతర వివాహం చేసుకోవడంతోనే యువకున్ని చంపినట్లు తెలుస్తోంది. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒకే గ్రామానికి చెందిన బిల్లాపురం నాగరాజు, సయ్యద్ సుల్తానా ఏడాది కాలంగా ప్రేమించుకుంటున్నారు. వారు పెళ్లి చేసుకోవాలనుకుంటున్న విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేశారు. అయితే ఇరు వర్గాలపెద్దలు వారి పెళ్లిని వ్యతిరేకించారు. దీంతో వారిద్దరూ పెద్దలను వ్యతిరేకించి ఈ ఏడాది జనవరి 31న లక్ష్మీనగర్ లోని ఆర్యసమాజ్ లో వివాహం చేసుకున్నారు.

పెళ్ళి తర్వాత కూడా ఇనే కుటుంబాలు వివాహానికి అడ్డు చెప్పారు. ప్రేమ వివాహం చేసుకున్న తమకు రక్షణ కావాలని పోలీసులను ఆశ్రయించారు.ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా మర్పల్లిలో నివాసముంటున్న నాగరాజు-సుల్తానా బుధవారం హైదరాబాద్ కు వచ్చారు. ఈ విషయం తెలుసుకుని వీరిని వెంబడించిన దుండగులు సరూర్ నగర్ లో వీరిని అడ్డగించారు. ఇనుప రాడ్తో నాగరాజుపై దాడి చేశారు. రద్దీగా ఉండే రోడ్డుపై జనాలు చూస్తుండగానే నాగరాజును కత్తితో పొడిచాడు. గమనించిన వాహనదారులు దంపతులను రక్షించేందుకు ప్రయత్నించారు. కానీ తీవ్ర రక్తస్రావమై నాగరాజు అక్కడికక్కడే మృతి చెందాడు. సయ్యద్ సుల్తానా సంఘటనలో తీవ్రంగా గాయపడింది.