Asianet News TeluguAsianet News Telugu

కామారెడ్డిలో బీఆర్ఎస్‌కు భారీ షాక్.. కాంగ్రెస్‌లో చేరిన మున్సిపల్ వైఎస్ చైర్‌పర్సన్ ఇందుప్రియ..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ అధికార బీఆర్‌ఎస్‌కు కామారెడ్డి నియోజకవర్గంలో భారీ షాక్ తగిలింది.

big shock to BRS in kamareddy municipal vice chairman indu priya Joins Congress ksm
Author
First Published Oct 31, 2023, 12:31 PM IST | Last Updated Oct 31, 2023, 12:31 PM IST

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ అధికార బీఆర్‌ఎస్‌కు కామారెడ్డి నియోజకవర్గంలో భారీ షాక్ తగిలింది. రాష్ట్ర ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పోటీ చేయనున్న కామారెడ్డిలో పలువురు నేతలు పార్టీకి గుడ్‌ బై చెప్పారు. వారిలో కామారెడ్డి మున్సిపల్ వైఎస్ చైర్‌పర్సన్ గడ్డం ఇందు ప్రియ‌తో పాటు మరికొందరునేతలు ఉన్నారు. వారంతా  తమ రాజీనామా లేఖలను బీఆర్ఎస్ పార్టీకి పంపించారు.  

అనంతరం ఈరోజు ఇందుప్రియతో పాటు పలువురు నేతలు హైదరాబాద్‌లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ కూడా పాల్గొన్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios