వైఎస్ఆర్‌సిపి ఆంధ్ర ప్రదేశ్ లో ఘన విజయం సాధించడంపై తెలంగాణ కాంగ్రెస్ నాయకులు, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మాదిరిగానే  ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి కూడా మంచి పోరాటపటిమ కలిగిన నాయకుడని పొగిడారు. ఇలా పదేళ్లపాటు అలుపెరగకుండా పోరాడి చివరికి విజయాన్ని అందుకున్న జగన్ ను ప్రశంసించకుండా వుండలేకపోతున్నానని కోమటిరెడ్డి  అన్నారు. 

ఆంధ్ర ప్రదేశ్ ప్రజల మనసులు జగన్ గెలుచుకోవడం వల్లే  వైఎస్సార్‌సిపికి ఈ ఘనవిజయం సాధ్యమయ్యిందన్నారు. వెఎస్‌ఆర్ కుటుంబం మాటమీద నిలబడే రకమని... కాబట్టి ఏపి ప్రజలకిచ్చిన హామీలన్నింటిని జగన్ అమలుచేసి సుపరిపాలన అందిస్తాడని భావిస్తున్నట్లు తెలిపారు. ఇక రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా సనిచేసిన రోజులను గుర్తుచేసుకున్ని కోమటిరెడ్డి ఆయనతో తన అనుబందం ఎలా వుండేదో గుర్తుచేశారు. 

ఏపిలో అద్భుతమైన విజయాన్ని అందుకుని ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్న జగన్ కు కోమటిరెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. తన పదవీకాలంలో ప్రజలకు మంచి పాలన అందించి జగన్ తన తండ్రి పేరును నిలబెట్టాలని కోమటిరెడ్డి సూచించారు.