సత్యేంద్ర వచ్చిన తర్వాత.. అతని కుమారుడి పేరు పెట్టే ఫంక్షన్ చేయాలని అనుకున్నారట. కానీ.. అంతలోనే కనీసం కొడుకును చూడకుండానే ప్రాణాలు కోల్పోయాడు. 


రెండు రోజుల క్రితం సికింద్రాబాద్ లోని బోయిగూడలోని గోడౌన్ లో అగ్నిప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ అగ్నిప్రమాదంలో... 11మంది వలస కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. కాగా.. సదరు కార్మికులంతా రీయూనియన్ కోసం హైదరాబాద్ కి వచ్చారట. వారి.. రీ యూనియన్ కాస్త.. అంత్యక్రియలతో ముగియడం అందరీనీ విషాదానికి గురించేసింది. వారిలో ఒక్కొక్కరికి ఒక్కో కథ కావడం గమనార్హం.


కొడుకును ఒక్కసారి కూడా చూడలేదు.. అగ్నిప్రమాదానికి గంటల ముందు మంగళవారం రాత్రి సత్యేంద్ర కుమార్ (32) శుభవార్త చెప్పేందుకు తన భార్య మీరాకు ఫోన్ చేశాడు. ఏప్రిల్ 8న ఆయనత స్వగ్రామానికి వస్తున్నట్లు తన భార్యకు చెప్పాడు. తన మూడు నెలల కుమారుడిని ఇప్పటి వరకు చూడలేదని.. తొలిసారి గ్రామానికి వెళ్లి చూడాలని అనుకున్నట్లు చెప్పడం గమనార్హం. సత్యేంద్ర వచ్చిన తర్వాత.. అతని కుమారుడి పేరు పెట్టే ఫంక్షన్ చేయాలని అనుకున్నారట. కానీ.. అంతలోనే కనీసం కొడుకును చూడకుండానే ప్రాణాలు కోల్పోయాడు.


మేలో వివాహం: గత మూడేళ్లుగా, చత్తిలాల్ రామ్ అలియాస్ గొల్లు (28) తన పెళ్లి కోసం పొదుపు చేస్తున్నాడు, ఈ సంవత్సరం మేలో అతను పెళ్లి చేసుకోవాల్సి ఉంది. అతను హైదరాబాద్‌లోని తన స్నేహితులను చాలా మందిని కూడా ఆహ్వానించాడు . వాళ్ల ఇంట్లో అతనే చిన్నవాడు. పెళ్లి చాలా గ్రాండ్ గా చేయాలని కుటుంబసభ్యులు అనుకున్నారు. ఏప్రిల్ 7 అతను పెళ్లి పనులు చూసుకోవడానికి స్వగ్రామానికి వెళ్లాలి అనుకున్నాడు. కానీ అంతలోనే ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. అతని మరణ వార్త విని గ్రామస్థులు కూడా ఇంకా షాక్ లోనే ఉండటం గమనార్హం. 

పెళ్లి డబ్బులతో అన్నకు అంత్యక్రియలు... రిషిక వివాహం మే 26న జరగాల్సి ఉంది. కానీ ఇప్పుడు ఆమె దానిని నిలిపివేయడమే కాకుండా ఆ డబ్బును తన ఏకైక సోదరుడి అంత్యక్రియలకు ఉపయోగించాలని నిర్ణయించుకుంది - 19 ఏళ్ల పంకజ్ కుమార్. "అతను మా కుటుంబానికి అండదండగా ఉన్నాడు . ఇప్పుడు నేను మా తల్లిదండ్రులకు అండగా నిలవాలిఅందువల్ల, నేను కనీసం పెళ్లి చేసుకోవడం లేదు," అని పంకజ్ సోదరి రిషిక చెప్పడం గమనార్హం.