Asianet News TeluguAsianet News Telugu

పుట్ట మధు అరెస్ట్ పై నోరు విప్పని ఏపీ పోలీసులు.. !!

పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధు అరెస్టుపై పశ్చిమగోదావరి పోలీసులు ఏ మాత్రం నోరు మెదపడం లేదు. పుట్టమధు అరెస్ట్ పై తమ వద్ద ఎలాంటి సమాచారం లేదని పేర్కొంటున్నారు. అయితే పుట్టమధు కోసం శుక్రవారం మొత్తం తెలంగాణ పోలీసులు భీమవరంలో ఉన్నారు.

bhimavaram police keep silence on putta madhu arrested - bsb
Author
Hyderabad, First Published May 8, 2021, 4:15 PM IST

పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధు అరెస్టుపై పశ్చిమగోదావరి పోలీసులు ఏ మాత్రం నోరు మెదపడం లేదు. పుట్టమధు అరెస్ట్ పై తమ వద్ద ఎలాంటి సమాచారం లేదని పేర్కొంటున్నారు. అయితే పుట్టమధు కోసం శుక్రవారం మొత్తం తెలంగాణ పోలీసులు భీమవరంలో ఉన్నారు.

భీమవరంలో ఉంటూ కోసం తీవ్రంగా గాలించారు దాదాపు ఎనిమిది మంది తెలంగాణ పోలీసులు పుట్ట మధు భీమవరంలోని పలు హోటళ్లలో గాలించారు. అంతేకాకుండా గదులు కావాలని పలు లాడ్జిలు, హోటళ్లు కూడా తెలంగాణ పోలీసులు తిరిగినట్లు హోటల్ సిబ్బంది పేర్కొంటున్నారు.

పుట్టమధు కోసం ఆయా హోటళ్లలో పోలీసులు గాలించిన దృశ్యాలు మాత్రం హోటల్ సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఇంత జరిగినా, పశ్చిమగోదావరి పోలీసులు పుట్ట మధు అరెస్టు సమాచారం తమకు లేదని పేర్కొంటున్నారు. అయితే ఉన్నత స్థాయి అధికారుల ఆదేశాలను దృష్టిలో పెట్టుకునే అలా అంటున్నట్లు తెలుస్తోంది.

పుట్ట మధు చుట్టూ ఉచ్చు: వామన్ రావు దంపతుల హత్య కేసులో రూ. 2 కోట్ల సుపారీ?...

పెద్దపల్లి జడ్పీ చైర్మన్ టిఆర్ఎస్ నేత పుట్టమధు ఎట్టకేలకు అరెస్టయ్యారు. ఆయనను పోలీసులు భీమవరంలో అరెస్టు చేశారు. గత కొన్ని రోజులుగా పుట్ట మధు అజ్ఞాతంలో ఉన్నారు. శుక్రవారం కూడా మధు ఫోన్ స్విచాఫ్ చేసి ఉండడంతో ఆయన ఎక్కడ ఉన్నారు అన్న అంశం మిస్టరీగా మారింది. 

ఇటీవల మంత్రివర్గం నుంచి బర్తరఫ్ కు గురైన ఈటెల రాజేందర్ తో పుట్ట మధు సన్నిహితంగా మెలగడంతో పాటు ఆయనతో కలిసి వ్యాపార లావాదేవీలు కూడా నిర్వహించినట్లు, దీంతో ఆయనపై సీఎం కేసీఆర్ అసంతృప్తితో ఉన్నందునే అజ్ఞాతంలోకి వెళ్ళిపోయినట్లు ప్రచారం జరిగింది.

మరోవైపు మూడు నెలల క్రితం జరిగిన హైకోర్టు న్యాయవాదులు వామనరావు దంపతుల హత్య కేసులో పుట్టమధు పై వచ్చిన ఆరోపణలపై పోలీసులు విచారణ జరుపుతున్నారనే చర్చ కూడా జరుగుతోంది.

Follow Us:
Download App:
  • android
  • ios