హైద్రాబాద్ లోని బేగంపేట వడ్డెర కాలనీలో కలుషిత నీరు తాగి ఒకరు చనిపోయారు. 27 మంది ఈ ఘటనలో అస్వస్థతకు గురయ్యారు. అయితే ఈ విషయమై అధికారులు విచారణ చేస్తున్నారు.
హైదరాబాద్: నగరంలోని Madhapur కు సమీపంలో బేగంపేట వడ్డెర కాలనీలో కలుషిత నీరు కారణంగా ఒకరు మరణించగా, మరో 27 మంది అస్వస్థతకు గురయ్యారు. అయితే తాగు నీరు కలుసితం కాలేదని జీహెచ్ఎంసీ వాటర్ వర్క్స్ అధికారులు ప్రకటించారు.
గుట్టల బేగం బజార్ కాలనీలో గత కొంత కాలంగా Drinking Water కలుషితం అవుతుందని స్థానికులు ఆరోపిస్తున్నారు.ఈ విషయమైWater works అధికారులకు కూడా ఫిర్యాదులు చేశారు.ఈ ఫిర్యాదులపై వాటర్ వర్క్స్ అధికారులు స్పందించలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.
రెండు రోజులుగా ఈ బస్తీవాసులు అస్వస్థతకు గురౌతున్నారు. Bheemaiah అనే వ్యక్తి కొండాపూర్ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. కలుషిత నీరే కారణమని బస్తీవాసులు చెబుతున్నారు. ప్రస్తుతం 27 మంది కాలనీవాసులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో ముగ్గురు చిన్నారుల పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు. కలుషిత నీటి కారణంగానే ఈ పరిస్థితి నెలకొందని వైద్యులు చెబుతున్నారు. ఈ ప్రాంతానికి సరఫరా అవుతున్న నీటి శాంపిల్స్ ను ల్యాబ్ కు పంపి పరీక్షలు చేయాలని కూడా అధికారులు నిర్ణయం తీసుకొన్నారు. బస్తీవాసులు అస్వస్థతకు గల కారణాలను గుర్తించి అధికారులు చర్యలు తీసుకొంటారు.
