Asianet News TeluguAsianet News Telugu

బంద్ లో పాల్గొనే నైతి హక్కు టీఆర్ఎస్‌ కు లేదు.. పొన్నం

కరీంనగర్ జిల్లాలో భారత్‌ బంద్ ఉద్రిక్తంగా మారింది. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నేతలు రచ్చ రచ్చ చేశారు. భారత్ బంద్‌లో టీఆర్ఎస్ పార్టీ పాల్గొనడంపై కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో ఇరు పార్టీల నేతల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. 

Bharat Bandh : TRS, Congress fight in Karimnagar - bsb
Author
Hyderabad, First Published Dec 8, 2020, 9:56 AM IST

కరీంనగర్ జిల్లాలో భారత్‌ బంద్ ఉద్రిక్తంగా మారింది. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నేతలు రచ్చ రచ్చ చేశారు. భారత్ బంద్‌లో టీఆర్ఎస్ పార్టీ పాల్గొనడంపై కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో ఇరు పార్టీల నేతల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. 

భారత్ బంద్ లో భాగంగా కరీంనగర్ బస్టాండు గేటు ముందు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో  ఆందోళన నిర్వహిస్తున్నారు. పొన్నంతో సహా కాంగ్రెస్ నాయకులు అంతా కలిసి నిరసన తెలుపుతుండగా టిఆర్ఎస్ రైతు సంఘం ఆధ్వర్యంలో టిఆర్ఎస్ నాయకులు అక్కడికి రాగా టిఆర్ఎస్ నాయకులని గో బ్యాక్ అని కాంగ్రెస్ నాయకులు నినాదాలు చేయడంతో టిఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులకి గొడవ మొదలైంది.

గోబ్యాక్ అని ఇరువురు నాయకులు నినాదాలు చేసుకోని తోపులాట జరుగగా చివరికి పోలీసులు జోక్యం చేసుకోవడంతో గొడవ సద్దు మనిగింది. టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల ఘర్షణతో కరీంనగర్ ప్రధాన బస్టాండ్ ఎదుట టెన్షన్ వాతావరణం నెలకొంది. 

ఈ సందర్భంగా కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ...బంద్‌లో పాల్గొనే నైతిక హక్కు టీఆర్ఎస్‌ లేదన్నారు. కేసీఆర్‌కు దమ్ముంటే అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. సన్న వడ్లకు మద్దతు ధర ఇవ్వని కేసీఆర్.. భారత్ బంద్‌కి మద్దతు ఇవ్వడమా అని యెద్దేవా చేశారు. కేంద్రం తెచ్చిన చట్టాలు రైతులకు ఉరితాల్లే..దేశమంతా బంద్ నడుస్తోందని పొన్నం తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios