కుమారుడిని చూడనివ్వలేదని మనస్తాపంతో జూనియర్ ఆర్టిస్ట్ ఆత్మహత్య
Kothagudem : దంపతుల గొడవల నేపథ్యంలో భార్య కుమారుడిని తీసుకుని ఐదు నెలల క్రితం పుట్టింటికి వెళ్లిపోయింది. ఇటీవల తన కుమారుడినీ, భార్యను చూడటానికి వెళ్లాడు భర్త. అయితే, తన కుమారుడిని చూడనివ్వకపోవడంతో మానస్తాపానికి గురై ఆ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగుడెం జిల్లాలో చోటుచేసుకుంది.

Kothagudem : కుటుంబంలో గొడవల నేపథ్యంలో భార్య కుమారుడిని తీసుకుని ఐదు నెలల క్రితం పుట్టింటికి వెళ్లిపోయింది. ఇటీవల తన కుమారుడినీ, భార్యను చూడటానికి వెళ్లాడు భర్త. అయితే, తన కుమారుడిని చూడనివ్వకపోవడంతో మానస్తాపానికి గురై ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగుడెం జిల్లాలో చోటుచేసుకుంది.
వివరాల్లోకెళ్తే.. తన కుమారుడిని చూడనివ్వలేదని మనస్తాపం చెంది తండ్రి ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన కొత్తగూడెం టూటౌన్ లో చోటుచేసుకుంది. సోమవారం జరిగిన ఈ ఘటన గురించి పోలీసులు, స్థానికులు వెల్లడించిన వివరాల ప్రకారం.. త్తగూడెం మున్సిపాలిటీ రామవరం పరిధిలోని నేతాజీబస్తీకి చెందిన సింగారపు భరత్‌కుమార్, సుభద్రల కుమారుడు ప్రేమ్ కుమార్ ఒక కంపెనీలో ప్రయివేటు ఉద్యోగంతో పాటు సీరియళ్లు, సినిమాల్లో జూనియర్ ఆర్టిస్ట్‌గా కూడా నటిస్తున్నాడు. అయితే హైదరాబా ఒక యువతితో వివాహం జరిగి దాదాపు ఆరేండ్లు కావస్తుంది. వారికి ఐదేళ్ల బాబు కూడా ఉన్నాడు.
అయితే, ఇటీవల భార్యభర్తల మధ్య గొడవలు జరగడంతో భార్య కుమారుడిని తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. దాదాపు ఐదు నెలలు కావస్తున్నది. అయితే, తన కుమారుడినీ, భార్యను చూడటానికి వెళ్తే.. చూడనివ్వలేదని మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదుచేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.
ఆత్మహత్యలు పరిష్కారం కాదు
ప్రతి సమస్యకు ఓ పరిష్కారం ఉంటుంది. సమస్య వచ్చినప్పుడు ధైర్యంగా ఎదుర్కోవాలని మానసిక నిపుణులు సూచిస్తున్నారు. జీవితంలోని ప్రతి సమస్యకు చావు ఒక్కటే పరిష్కారం కాదు. జీవితంలో మీకెప్పుడైనా మానసిక ఒత్తిడితో బాధపడుతూ సహాయం కావాలనిపిస్తే వెంటనే ఆసరా హెల్ప్ లైన్ ( +91-9820466726 ) కి కాల్ చేయండి లేదా ప్రభుత్వ హెల్ప్ లైన్ కి కాల్ చేయండి. జీవితం చాలా విలువైనది.