భద్రాద్రి కొత్తగూడెం (bhadradri kothagudem) జిల్లాలో తుపాకీ మిస్ ఫైర్ అయింది. తుపాకీ మిస్ ఫైర్ కావడంతో ఓ హెడ్ కానిస్టేబుల్ (head constable) అక్కడికక్కడే మృతిచెందారు.
భద్రాద్రి కొత్తగూడెం (bhadradri kothagudem) జిల్లాలో తుపాకీ మిస్ ఫైర్ అయింది. తుపాకీ మిస్ ఫైర్ కావడంతో ఓ హెడ్ కానిస్టేబుల్ (head constable) అక్కడికక్కడే మృతిచెందారు. ప్రమాదవశాత్తు ఈ ఘటన చోటుచేసకుందని అధికారులు చెబుతున్నారు. వివరాలు.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాచనపల్లి పోలీస్‌స్టేషన్‌లో సంతోష్ హెడికానిస్టేబుల్‌గా ఉన్నారు. నైట్ డ్యూటీలో ఉన్న సంతోష్ తెల్లవారుజామున ఆయుధాలను పరిశీలిస్తుండగా తుపాకీ మిస్ ఫైర్ అయిందని పోలీసులు తెలిపారు. ఆయుధాలను పరిశీలిస్తుండగా ప్రమాదవశాత్తు ఘటన జరిగిందని చెప్పారు. సంతోష్ మృతదేహాన్ని ఇల్లందు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఇక, మృతుడు సంతోష్ స్వస్థలం వరంగల్ జిల్లా గవిచర్ల. ప్రస్తుతం కాచనపల్లి పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్నారు. మూడు రోజుల క్రితమే సంతోష్ కుటుంబ సభ్యులు అతనికి పెళ్లి సంబంధం చూసినట్టుగా తెలుస్తోంది. త్వరలోనే పెళ్లి చేయాలని చూస్తున్నారు. అయితే అంతలోనే ఈ ఘటన చోటుచేసుకోవడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
