భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిజెపి అధ్యక్షుడు కోనేరు సత్యనారాయణ పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు. 

కొత్తగూడెం : పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిజెపి అధ్యక్షుడు కోనేరు సత్యనారాయణను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఈ సస్పెన్షన్ వెంటనే అమలులోకి వస్తుందని ప్రకటించారు. కోనేరు సత్యనారాయణ టిఆర్ఎస్ లో చేరనున్నారు. 

ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావుతో సమావేశమైన తెలంగాణ బిజెపి విభాగం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు కోనేరు సత్యనారాయణ (చిన్ని)ని మంగళవారం పార్టీ సస్పెండ్ చేసింది. పార్టీ నిబంధనలను ఉల్లంఘించినందుకు, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు చిన్నిని సస్పెండ్ చేస్తున్నట్లు పార్టీ రాష్ట్ర శాఖ ప్రకటించింది.

సస్పెన్షన్ తక్షణం అమల్లోకి వస్తుందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ప్రమేందర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. బీఆర్‌ఎస్ లో చేరాల్సిందిగా చిన్నిని ముఖ్యమంత్రి ఆహ్వానించడంతో సోమవారం అర్థరాత్రి హైదరాబాద్‌లో ముఖ్యమంత్రిని కలిసారాయన. దీంతో బీజేపీ ఈ చర్య తీసుకుంది.

బీజేపీకి రాజీనామా చేస్తున్నట్టు చిన్ని ఈ రోజు ప్రకటించే అవకాశం ఉంది. శుక్రవారం లేదా శనివారం ఆయన బీఆర్‌ఎస్‌లో చేరే అవకాశం ఉంది. చిన్ని 2014లో తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అభ్యర్థిగా కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. 2017లో బీజేపీలో చేరారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.