బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పార్టీ మారడానికి సిద్దమైనట్టు తెలుస్తోంది. వచ్చే నెల మొదటి వారంలో కాంగ్రెస్లో చేరే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. రేవంత్ తో కలిసి ఢిల్లీలో రాహుల్ సమక్షంలో పార్టీలో చేరడానికి సిద్ధమయ్యారంటూ ఆయన అనుచరవర్గం కూడా కోడై కూస్తుంది. ఈ తరుణంలో తుమ్మల కాంగ్రెస్ లో చేరడంపై భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య కీలక వ్యాఖ్యలు చేశారు.
బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పార్టీ మారడానికి సిద్దమైనట్టు తెలుస్తోంది. వచ్చే నెల మొదటి వారంలో కాంగ్రెస్లో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. రేవంత్ తో కలిసి ఢిల్లీలో రాహుల్ సమక్షంలో పార్టీలో చేరడానికి సిద్ధమయ్యారంటూ ఆయన అనుచరవర్గం కూడా కోడై కూస్తుంది.
వాస్తవానికి పాలేరు నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో దిగాలని తుమ్మల నాగేశ్వరరావు భావించారు. కానీ భంగపాటు తప్పలేదు. సీఎం కేసీఆర్ .. తుమ్మలను దూరం పెట్టారు. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన ఆయన తన ప్రధాన అనుచరులతో సమావేశామయ్యారు. ఈ క్రమంలో తాను రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్టు ప్రకటించారు. అయితే.. తొలుత స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తారనే ప్రచారం జోరుగా సాగింది.
ఆ తరువాత కాషాయం పార్టీలోకి చేరే అవకాశముందని, బీజేపీ సీనియర్ నేతలతో సంప్రదింపు జరిపినట్టు కూడా ప్రచారం జోరుగా సాగింది. కానీ, తాజాగా.. కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో దిగుతారనే ప్రచారం ఊపందుకుంది. ఈ తరుణంలోనే రేవంత్ తో కలిసి ఢిల్లీలో రాహుల్ సమక్షంలో పార్టీలో చేరడానికి సిద్ధమయ్యారంటూ ఆయన అనుచర వర్గం కూడా భావిస్తోంది.
దీంతో తుమ్మల ఏ పార్టీలో అడుగుపెడుతారు? ఆయన రాజకీయ భవిష్యత్ ఏమిటనేది తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మంచి ప్రజాదరణ ఉన్న నేతగా గుర్తింపు పొందిన తుమ్మలను తమ పార్టీల్లో చేర్చుకునేందుకు బీజేపీలు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.
ఈ తరుణంలో భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య(Bhadrachalam MLA Podem Veeraiah)మాట్లాడుతూ.. భద్రాద్రి జిల్లాను ఎంతో అభివృద్ధి చేసిన మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు వంటి పెద్దలు కాంగ్రెస్‌లోకి వస్తే అందరం స్వాగతిస్తామని తెలిపారు. భద్రాచలం అభివ్రుద్ది కోసం తుమ్మల ఎనలేని సేవచేశారని, ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వస్తే.. పార్టీ మరింతగా బలోపేతం అవుతుందని అన్నారు.తుమ్మల నాగేశ్వర్ రావు పార్టీలోకి రావాలని తాను కోరుతున్నట్లు తెలిపారు.
