హైదరాబాద్:  కరోనా విషయంలో నిర్లక్ష్యంగా ఉండొద్దని తెలంగాణ రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్ చెప్పారు. 

గురువారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు. కరోనా లేదని ప్రజలు భ్రమపడొద్దని ఆయన సూచించారు.సెకండ్ వేవ్ లు కాదు, మరిన్ని వేవ్ లు వచ్చే ప్రమాదం ఉందని... ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు.

చలికాలంలో కరోనాతో పాటు ఇతర వైరస్ లు కూడ ఎక్కువగా సోకే అవకాశం ఉందని ఆయన చెప్పారు. కరోనా వైరస్ నివారణకు వ్యాక్సిన్ రావడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉందని ఆయన చెప్పారు.

పండుగల సమయంలో జాగ్రత్తగా ఉండాలని ఆయన ప్రజలను కోరారు. పండుగ సమయంలో  కరోనా సోకకుండా ఎవరికి వారే జాగ్రత్తగా ఉండాల్సిందిగా కోరారు. కరోనా లేదని నిర్లక్ష్యంగా ఉండొద్దని ఆయన  కోరారు.

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు ఇటీవల కాలంలో పెరిగిపోతున్నాయి. పండుగల సమయంలో జాగ్రత్తగా లేకపోతే  కరోనా మరింత విజృంభించే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వైద్య ఆరోగ్య శాఖాధికారులు ఈ విషయమై ప్రజలకు పలు సూచనలు చేస్తున్నారు.చలికాలంలో కరోనాతో పాటు ఇతర వైరస్ లు కూడ విజృంభించే అవకాశం ఉందని తెలుస్తోంది.