Asianet News TeluguAsianet News Telugu

కేటీఆర్ గిప్ట్... పోచంపల్లి చీరలో మెరిసిపోతున్న బెంగాల్ ఎంపీ

ఇటీవల తెలంగాణ పర్యటన సందర్భంగా చేనేత మంత్రి కేటీఆర్ బహూకరించిన పోచంపల్లి చేనేత పట్టుచీరను కట్టుకున్న ఫోటోను బెంగాల్ ఎంపీ మహువా ట్వీట్ చేశారు.

bengal mp mahua moitra wearing ktr gifted pochampally saree
Author
Hyderabad, First Published Sep 15, 2021, 12:12 PM IST

హైదరాబాద్: తెలంగాణ చేనేత కార్మికుల చేతుల్లో రూపుదిద్దుకున్న చీరను కట్టి అందంగా ముస్తాబయ్యారు పశ్చిమబెంగాల్ ఎంపీ మహువా మొయిత్రా. ఐటీ రంగానికి సంబంధించిన పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ సభ్యురాలిగా ఉన్న మహువా ఇటీవల తెలంగాణలో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తరపున ఐటీ, చేనేత, జౌళి శాఖ మంత్రి కేటీఆర్ ఆమెకు పోచంపల్లి కాటన్ చీరను బహూకరించారు. ఈ చీర ఎంతగానో నచ్చడంతో తాజాగా చీర కట్టుకుని ఫోటోకు ఫోజిచ్చారు ఎంపీ. ఆ ఫోటోను ట్విట్టర్ లో పోస్ట్ చేసి తెలంగాణ నేతన్నల ప్రతిభను యావత్ దేశానికి చాటారు. 

''ఇండియన్ హ్యాండ్లూమ్ రాక్... ఇటీవల ఐటీ కమిటీ పర్యటనలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం తరపున మంత్రి కేటీఆర్ బహూకరించిన అత్యంత అందమైన పోచంపల్లి పట్టుచీరను ధరించాను'' అంటూ పోచంపల్లి చీరలో మెరిసిపోతున్న ఫోటోను జతచేసి ఎంపీ మహువా ట్వీట్ చేశారు. 

 

ఎంపీ మహువా ట్వీట్ పై మంత్రి కేటీఆర్ స్పందించారు. ''తెలంగాణకు చెందిన పోచంపల్లి చేనేతను మరింత ప్రచారం కల్పించిన మహువా గారికి ధన్యవాదాలు. నగుమోముతో, కళ్లతోనే నవ్వుతూ మేము బహూకరించిన చీరను దరించడం సంతోషాన్నిచ్చింది'' అంటూ మంత్రి కేటీఆర్ ఎంపీ మహువా ట్వీట్ కు రిప్లై ఇచ్చారు.   
 

Follow Us:
Download App:
  • android
  • ios