Asianet News TeluguAsianet News Telugu

హుజురాబాద్ ఉపఎన్నిక: దళిత బంధు డబ్బులు కోసం... బ్యాంకుల వద్ద క్యూ

దళిత బంధు స్కీంలో భాగంగా తమ ఖాతాల్లో డబ్బులు పడ్డాయా లేదా అని చూసుకునేందుకు పెద్ద ఎత్తున లబ్ధిదారులు బ్యాంకుల వద్ద క్యూ కట్టారు. పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన హుజురాబాద్ నియోజకవర్గంలోని దళితులందరికీ డబ్బులు అకౌంట్లలో జమ చేసే ప్రక్రియను జిల్లా యంత్రాంగం చేపట్టిన సంగతి తెలిసిందే.

beneficiaries queuing at banks for dalita bandhu money in huzurabad
Author
Huzurabad, First Published Sep 29, 2021, 3:04 PM IST

దళిత బంధు స్కీంలో భాగంగా తమ ఖాతాల్లో డబ్బులు పడ్డాయా లేదా అని చూసుకునేందుకు పెద్ద ఎత్తున లబ్ధిదారులు బ్యాంకుల వద్ద క్యూ కట్టారు. పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన హుజురాబాద్ నియోజకవర్గంలోని దళితులందరికీ డబ్బులు అకౌంట్లలో జమ చేసే ప్రక్రియను జిల్లా యంత్రాంగం చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఖాతాల్లో రూ. 9.90 లక్షలు జమ చేశారా లేదా అనే విషయంపై ఆరా తీస్తున్నారు. 

హుజురాబాద్ ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల కావడంతో నోటిఫికేషన్ అమలైతే తమకు రావల్సిన డబ్బులు రావేమోనన్న ఆందోళన స్థానికుల్లో నెలకొంది. ఈ మేరకు ప్రచారం కూడా జరగడంతో లబ్ధిదారులు బ్యాంకుల వద్దకు చేరుకున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం హుజురాబాద్‌లో అమలు చేస్తున్న దళిత బంధు కోసం డబ్బులను కలెక్టర్ అకౌంట్‌కు బదిలీ చేసింది. అయినప్పటికీ తమ చేతికి రాకపోతే ఎలా అన్న ఆందోళన ప్రజల్లో నెలకొంది. వ్యాపారం చేసుకోవాలని దరఖాస్తు చేసుకున్నా తన అకౌంట్‌కు డబ్బు రాలేదని ఓ వృద్దురాలు వివరించారు. అకౌంట్లో డబ్బు జమ అయినట్టు మొబైల్‌కు మెసేజ్ వచ్చి నెల రోజులు కావస్తున్నా నేటికీ ఖాతాలో మాత్రం రూ. 9.90 లక్షలు జమ కాలేదని మరో మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. 

Follow Us:
Download App:
  • android
  • ios