తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్ సరూర్‌నగర్ స్టేడియంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బీసీల సింహగర్జన బహిరంగసభ సమావేశం జరిగింది. ఈ బహిరంగసభకు 112 బీసీ కుల సంఘాలు మద్ధతునిచ్చాయి.
తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్ సరూర్‌నగర్ స్టేడియంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బీసీల సింహగర్జన బహిరంగసభ సమావేశం జరిగింది. ఈ బహిరంగసభకు 112 బీసీ కుల సంఘాలు మద్ధతునిచ్చాయి.
పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టి బీసీలకు చట్ట సభలకలో అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలలో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, పంచాయతీరాజ్, మున్సిపల్ ఇతర స్థానిక ఎన్నికలలో బీసీ రిజర్వేషన్లను 34 శాతం నుంచి 50 శాతం వరకు పెంచాలని బీసీ నాయకులు డిమాండ్ చేశారు.
ఈ బహిరంగసభకు బీసీ సంక్షేమ సంఘం జాతీయాధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య, ప్రజాగాయకుడు గద్దర్, టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, సీపీఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, చెరకు సుధాకర్ ఇతర బీసీ సంఘాల నేతలు హాజరయ్యారు.