హైదరాబాద్: ప్రభుత్వ పోస్టింగుల్లో అన్యాయం జరుగుతోందని, ప్రాధాన్యం లేని పోస్టులను కట్టబెడుతున్నారని ఎస్సీ, ఎస్టీ, బీసీ ఐఎఎస్‌లు  బుధవారం నాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శైలేంద్రకుమార్ జోషీని కలిసి వినతి పత్రం సమర్పించారు.

రెండు రోజుల క్రితం జరిగిన బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన ఐఎఎస్ అధికారులు రహస్య ప్రాంతంలో సమావేశమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ పోస్టింగుల విషయంలో  ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు ఇతర ఐఎఎస్ అధికారులతో చర్చించారు.

ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గానికి చెందిన ఐఎఎస్ అధికారులు ప్రభుత్వ పోస్టింగ్‌ల విషయంలో  ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బుధవారం నాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శైలేంద్ర కుమార్ జోషితో సమావేశమయ్యారు.  తమకు జరుగుతున్న అన్యాయంపై ఐఎఎస్‌లు సీఎస్‌కు వివరించారు.

సీనియారిటీ ఆధారంగా కూడ ఎస్సీ, ఎస్టీ, బీసీ ఐఎఎస్‌లకు పోస్టింగ్‌లు ఇవ్వడం లేదన్నారు.  ఈ విషయాన్ని రాతపూర్వకంగా  సమర్పించాలని ఐఎఎస్‌లను సీఎస్ జోషీ కోరారు.  ఈ మేరకు తమకు జరిగిన అన్యాయంపై సీఎస్ కు రాత పూర్వకంగా ఐఎఎస్ లు అందించారు. ఇదే విషయమై రాష్ట్ర గవర్నర్ ను కూడ కలవాలని ఐఎెస్ అధికారులు భావిస్తున్నారు.